పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి ప్ర‌భుత్వం తోడు 

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మన ప్రభుత్వంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు
 

శ్రీ‌కాకుళం: పుట్టిన బిడ్డ ద‌గ్గ‌ర నుంచి పండు ముస‌లి వ‌ర‌కూ ప్రతి ఒక్కరికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం తోడుగా ఉంద‌ని మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు అన్నారు.  గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని మంత్రి ధ‌ర్మాన పెద్ద రెల్లి వీధిలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజులుగా ఈ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్య‌క్ర‌మం సాగింది. నేను పోటీచేసిన నాలుగు సార్లు ఈ వార్డు నాకు తోడుగా ఉన్నారు. మీ పట్ల నాకు ఎక్కువ బాధ్యత ఉంది. రూ.22.88 కోట్లు సంక్షేమం ఈ వార్డు ప్రజలకు గడించిన మూడున్నరేళ్ల‌లో అందించాం. రాష్ట్రం మొత్తం మీద ఇదే పద్ధతి, అందుకోసమే ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. 

కరోనా సమయంలో 9 నెలలు ఉచితంగా రేషన్ అందించాం. ఒక సారి మన ప్రభుత్వ ఆసుపత్రిని గమనించండి.గతానికీ,ఇప్ప‌టికీ ఉన్న తేడా గమనించండి. మన మార్కెట్ ను గమనించండి,టౌన్ శానిటేషన్ చూడండి. ఒక్క కంప్లైంట్ లేదు. ఇది అభివృద్ధి కాదా ? ఇది పరిపాలనలో భాగమే కదా ! ఒక్కరికైనా లంచం ఇచ్చారా ? ఇన్ని పథకాలు అందుకునే క్రమంలో ఎవ్వ‌రైనా మ‌ధ్య‌వ‌ర్తులు ఉన్నారా ? 

ప్రతిపక్ష నాయ‌కుల‌కు విమర్శలు చేయడానికి విషయం లేక ధరలు పెరుతున్నాయి అని గగ్గోలు పెడుతున్నారు. అవి దేశం మొత్తం మీద పెరిగాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. చంద్రబాబు ఎన్నికల ముందు పథకాలు ఇస్తే, జగన్ అధికారంలోకి రాగానే తాను ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ‌ను మొదలు పెట్టారు. పేద‌వారి పిల్లలు నిరక్షరాస్యలుగా ఉండకూడ‌దని చదువుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం. నాడు - నేడు ద్వారా స్కూల్స్- లో అనేక మార్పులు తీసుకు వస్తున్నాం. ఇవాళ (నవంబ‌ర్ 26) రాజ్యాంగ దినోత్స‌వాన్ని నిర్వ‌హించుకుంటున్నాం మ‌నం. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత రాజ్యాంగ ర‌చ‌న చేసుకున్నాం. కొన్ని స‌వ‌ర‌ణ‌లూ చేసుకున్నాం. ఇప్పుడు మ‌న దేశం చెక్కు చెద‌ర‌కుండా నిల‌బ‌డగ‌లిగింది. రాజ్యాంగం అమ‌లులో  మ‌న ప్ర‌భుత్వం గొప్ప స్ఫూర్తి చాటుతూ పాల‌న అందిస్తోంది. ఇది క‌దా ! గొప్ప విష‌యం అని నేను మీకు విన్న‌విస్తున్నాను. కార్య‌క్ర‌మంలో భాగంగా స్థానికుల నుంచి వ‌చ్చిన విన‌తుల మేర‌కు వార్డులో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు,కమ్యూనిటీ హాల్ మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేశు, కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతీ, సాధు వైకుంఠ రావు, చల్లా శ్రీనివాసరావు, బైరి మురళి, మెంటడా స్వరూప్, కొనర్క్ శ్రీనివాసరావు, డాక్టర్ పైడి మహేశ్వరరావు, సుంకరి కృష్ణ  చల్లా అలివేలు మంగ, గంగు శారద తదితరులు పాల్గొన్నారు
 

తాజా వీడియోలు

Back to Top