విశాఖే రాజధాని 

రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు 

రైతుల‌ను అడ్డం పెట్టుకుని చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ మాఫియా

విశాల ప్రయోజనాల కోసం సీఎం వైయ‌స్ జగన్ దేనికైనా తెగిస్తారు

మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యంపైనే క‌ట్టుబ‌డి ఉన్నాం

 శ్రీ‌కాకుళం :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి విశాఖ‌నే కార్య నిర్వాహ‌క రాజ‌ధానిగా ఉంటుంద‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఉద్ఘాటించారు. విశాఖ రాజ‌ధాని సాధ‌నే త‌మ  ధ్యేయ‌మ‌ని తేల్చి చెప్పారు. విశాఖ రాజ‌ధాని సాధ‌న ఐక్య వేదిక నేతృత్వాన స్థానిక సన్ రైజ్ హోట‌ల్ లో రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని నిర్వహించారు. నాన్ పొలిటిక‌ల్ జేఏసీ త‌ర‌ఫున జ‌రుగుతున్న ఉద్య‌మానికి కొన‌సాగింపుగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను నిర్ణ‌యించేందుకు ఈ స‌మావేశంలో ప‌లు తీర్మానాలు చేశారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో చాలా భిన్న‌మ‌యిన అభిప్రాయాలు ఉన్నాయి. మాకు అన్యాయం జ‌రిగింది అని చెప్పేవాళ్లు.. ఈ రాష్ట్రంలో మేం వెనుక‌బ‌డిపోయాం అని చెప్పేవాళ్లు ఉన్నారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ‌ధానే విశాఖ అని గొంతుక వినిపించ‌క‌పోతే మళ్లీ మేం వెన‌క‌బ‌డిపోతాం అన్న భ‌యం అయితే ఉంది. ఈ  నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌తిపాదించిన విధంగా పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం సెక్ష‌న్ 6 అన్న‌ది ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌ను ధ్రువీక‌రిస్తోంది. హ్యూజ్ క్యాపిట‌ల్ అన్న‌ది ఇక్క‌డ పెట్టకూడ‌ద‌నే చెప్పింది. అదేవిధంగా 75 ఏళ్ల పాటు మ‌నం కృషి చేసి పెద్ద క్యాపిట‌ల్ ను అభివృద్ధి చేశామో, ఆ రాజ‌ధానిని వాడుకునేందుకు వేర్పాటు వాద ఉద్య‌మాలు వ‌చ్చాయి. ఒక‌వేళ అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేసి ఉంటే అప్పుడు వేర్పాట వాద ఉద్య‌మాలు వ‌చ్చేవి కావు. కానీ ఆ విధంగా జ‌ర‌గ‌లేదు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయాక నాటి మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ నేతృత్వంలో క‌మిటీ వేశారు. కానీ చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉన్న క‌మిటీ నిర్ణ‌యాల‌ను కాద‌ని, మీ క్యాబినెట్ కు చెందిన వారిని, ఇంకా మీ మీ మ‌నుషుల‌ను క్రోడీక‌రించి వేసిన క‌మిటీ అమ‌రావ‌తి ఎలా నిర్ణ‌యిస్తుంది. అదేవిధంగా ఆ రోజు మూడు  వేల‌కు పైగా జీఓలు ఇష్యూ చేసి అమ‌రావ‌తికి అనుకూలంగా వెలువ‌రించారు. ఆ రోజు అక్క‌డున్న కేసులు త‌ప్పించుకునేందుకు మాత్ర‌మే ఇక్క‌డికి వ‌చ్చారు. నాకు అనిపించింది ఏంటంటే రియ‌ల్ ఎస్టేట్ మోడ‌ల్ లో అమ‌రావ‌తి ప్రాంతాన్ని డెవ‌ల‌ప్ చేసి త‌న వారికి మేలు చేయాల‌ని భావించారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకున్నామ‌ని చెప్పి అబ‌ద్ధాలు చెప్పారు. ఇదే సంద‌ర్భంలో త‌న వారికి మేలు చేసే విధంగా అమ‌రావ‌తి క్యాపిటల్ ను డెవ‌ల‌ప్మెంట్ కు ప్రాధాన్యం ఇచ్చారు. 
ఏ విధంగా చూసుకున్నా క్లోజ్డ్ డెవ‌ల‌ప్మెంట్ మోడ‌ల్ కు ఇప్పుడున్న ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. క‌నుక మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న అన్న‌ది తెర‌పైకి వ‌చ్చింది. నాకు రైతులంటే కోపం లేదు. కానీ రైతుల‌ను అడ్డం పెట్టుకుని రియ‌ల్ ఎస్టేట్ మాఫియా నిర్వ‌హించ‌డం స‌బ‌బు కాదు. చంద్ర‌బాబు రైతుల‌ను అడ్డం పెట్టుకుని రియ‌ల్ ఎస్టేట్ మాఫియా న‌డుపుతున్నారు. ఇన్నాళ్లుగా మ‌నం సాధించుకోలేక‌పోయింది ఇప్పుడు సాధించుకోవాల్సిన త‌రుణం రానే వ‌చ్చింది. ఒక‌ప్పుడు రాజ‌ధానికి వెళ్లాలంటే వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌చ్చేది. ఇప్పుడు మ‌న‌కు చేరువ‌లోనే రాజ‌ధాని ఏర్పాటు కానుంది. అంటే మ‌న‌కు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు మెరుగు కానున్నాయి. క‌నుక ఈ విష‌య‌మై అంతా ఏక‌మై పోరాడాల్సి ఉంది. రాజ‌ధాని ఏర్పాటుకు సంబంధించి ఎప్పుడో శివ‌రామ‌కృష్ణన్ క‌మిటీ చెప్పింది. ఆ కమిటీ అన్న‌ది కేంద్రం నియమించింది. రాజ్యాంగ బ‌ద్దంగా ఏర్పాట‌యిన క‌మిటీ మాట‌లు అటుంచి అప్పట్లో చంద్ర‌బాబు నిర్ణ‌యాలు వెలువ‌రించారు. 

త‌న వారికి అనుగుణంగా రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు వీలుగా త‌న సొంత మ‌నుషుల‌తో అప్ప‌టి మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణతో కూడిన ఫైవ్ మెంబ‌ర్  క‌మిటీ వేశారు. త‌మ‌కు అనుగుణంగా త‌మ వారికి అనుగుణంగా అప్ప‌ట్లో నిర్ణ‌యాలు వెలువ‌రించారు. ఇప్పుడు మేం అధికారంలోకి వ‌చ్చాక మొత్తం అన్నింటినీ ప‌రిశీలించాక ఇక్క‌డ రాజ‌ధాని  నిర్మాణం ఆర్థికంగా కూడా భారం అని గుర్తించాం. అంతేకాదు శివ రామ కృష్ణ‌న్ చెప్పిన విధంగా ఒకే చోట రాజ‌ధాని అని కాకుండా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌కు స‌మ‌యాత్తం అవుతున్నాం. అందులో భాగంగా ప‌రిపాల‌న రాజ‌ధాని  గా విశాఖ‌ను చేయాల‌నుకుంటున్నాం. విశాల దృక్ప‌థంతో పాల‌న‌ను అందించాల‌న్న సంక‌ల్పంతో  ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. 

లార్జ్ క్యాపిటల్ అన్న కాన్సెప్టే ఈ రాష్ట్రానికి ప‌నికి రాదు అని శివ రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పింది. ఆ రోజు నివేదిక అనుసారం సెక్ష‌న్ 6లో భాగంగా ప్ర‌స్తావించిన విష‌యాలు ఎక్క‌డా అమ‌లు చేయ‌లేదు. హ్యూజ్ క్యాపిటల్ కు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఏ విధంగా అనుకూలి స్తుంద‌ని, అందుకు ఐదు ల‌క్ష‌ల కోట్లు, నాలుగు ల‌క్ష‌ల కోట్లు వెచ్చించడం అంటే అది స‌బ‌బు కాదు. 

పూర్వం ఇలానే మ‌నం ఒకే ప్రాంతంలో రాజ‌ధానిని అభివృద్ధి చేశాం. ఓ యాభై ఏళ్ల త‌రువాత ఆ రాజ‌ధాని వ‌దిలి రావాల్సి వ‌చ్చింది. అయినా మీకు తెలియ‌దా.. మీ అనుభ‌వం ఇదే చెబుతుందా ? ఆ రోజు దొన కొండ అని నూజివీడు అని, మొదట్లో చెప్పారు. త‌రువాత మీరు ఇంట‌ర్న‌ల్ గా ఓ మోడ‌ల్ తీసుకుని అందుకు అనుగుణంగా రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాల‌కు అనుగుణంగా  చేశారు. కానీ దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొందింది ఎవ‌రు. ఆ రోజు జీ టు జీ అని  ఓ ఒప్పందం జ‌రిగింద‌ని చెప్పార‌ని , కానీ సింగ‌పూర్ ప్ర‌భుత్వ మంత్రి ఇవేవీ నిజం కాదు అని, త‌ప్పు అని,ఓ ముఖ్య‌మంత్రి చెప్పిన విధంగా అవ‌న్నీ త‌ప్పు అని తేల్చార‌ని, ఆ విధంగా సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ నాటి ప్ర‌భుత్వ పెద్ద చెప్పిన మాట‌లు తోసి పుచ్చారు అని విన్న‌విస్తున్నాను. రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాట‌వుతున్న అమ‌రావ‌తిని ఏ విధంగా అంగీక‌రించాలి. ఎందుక‌ని మూడు రాజ‌ధానులు ఉండ‌కూడ‌దు. 

ఆ విధంగా ఎందుక‌ని ఆలోచించ‌కూడ‌దు. అందుకే ఎవ‌రిది ద్రోహం.. ఎవ‌రిది రాజ్యాంగ విరుద్ధం అన్న‌వి ఆలోచించాం. ఒక శాస‌న స‌భ‌కు రాజ‌ధాని విష‌య‌మై నిర్ణ‌యం తీసుకునే అధికారం లేదు అని హై కోర్టు అంటోంది. రాష్ట్రాల‌కు లేక‌పోతే ఎవ‌రికి ఉంటుంది కేంద్రానికి ఉంటుంది. కేంద్రం నియ‌మించిన క‌మిటీకి ఉంటుంది. కేంద్రం తీసుకువ‌చ్చిన విభ‌జ‌న చ‌ట్టం. ఆ చ‌ట్టం ప్ర‌కారం అమ‌లు చేయాల్సి న బాధ్య‌త ఎవ‌రిది రాష్ట్రానిదే క‌దా ! క‌నుక డిఫ‌రెంట్ ఆల్ట‌ర్ నేటివ్స్ లేవు. క‌నుక వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం శివ రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ఇగ్నోర్ చేయ‌డానికి అవ‌కాశ‌మే లేదు. ఈ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఉన్న ప్ర‌భుత్వం మోస‌పూరిత నిర్ణ‌యాల‌ను అంగీక‌రించ‌డ‌మా లేదా ఇవి త‌ప్పు అని చెప్ప‌డ‌మా ? ఎవ‌రు ఎటువైపు ఉండాలి. మ‌న పూర్వీకులు త‌ప్పు చేశారు అని, మ‌నం త‌ప్పు చేస్తామా .. నన్ను దృష్టిలో ఉంచుకుని మాట‌లు అన‌వ‌చ్చు కానీ రాజ‌ధాని విష‌య‌మై రాజ్యాంగం చెబుతున్న‌ది.. కేంద్ర క‌మిటీ చెబుతున్న‌ది అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ఎవ‌రిది ప్ర‌భుత్వానిది కాదా .. క‌నుక మేం మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యంపైనే క‌ట్టుబ‌డి ఉన్నాం. ఏ విధంగా చూసుకున్నా వికేంద్రీక‌ర‌ణ అన్న‌ది ఇప్ప‌టి భావ‌న కాదు. ఎప్ప‌టి నుంచో ఉంది. ప్రాంతాల మ‌ధ్య అస‌మాన‌త‌లు పోగొట్టేందుకు ఇటువంటి ప్ర‌య‌త్నాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి అని చెప్పారు.

 - ఆ రోజు చెన్నై నుంచి విడిపోయాక, రాజధాని ఎక్కడ పెట్టాలన్న నిర్ణ‌యం పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. కర్నూలులో రాజధాని ఉంటే, గుంటూరులో హై కోర్టు పెట్టారు. అప్పుడే వికేంద్రీకరణకు బీజం పడింది. మన పక్క రాష్ట్రం ఒడిశా చూడండి.అక్క‌డ రెండు రాజ‌ధానులు ఉన్నాయి. భువనేశ్వర్,కట‌క్.  

మన దేశంలో ఏ రాష్ట్రాలు రాజధాని నిర్మాణం కోసం లక్షలు కోట్లు ఖర్చు చేసే పరిస్థితి లేదు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు చేసిన మోసం బయట పడింది.

వైజాగ్ కి కాస్మోపాలిటన్ వాతావరణం ఉంది. జల,వాయు,రోడ్డు మార్గాలు అన్న‌వి అందుబాటులో ఉన్నాయి. వైజాగ్లోని అత్యంత ధనవంతుల జాబితాలో 100లో 99 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటారు. మన సంపద అంతా వెళ్ళిపోయింది. ఆ ఆవేదన మాకూ ఉంది. కానీ రాజ‌ధాని వ‌స్తే చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి అన్న‌ది సాధ్యం. రాజధాని నిర్మాణం చుట్టూ అత్యున్న‌త సంస్థ‌లు వ‌స్తాయి అన్న‌ది మా న‌మ్మ‌కం. ప్రపంచ స్థాయిలో అవకాశాలు అందుకునే అవకాశం ఉంటుంది.  ఒకనాడు నాది ఈ ఆస్తి అన్నవారు ఈ రోజు కూలి గా మిగిలిపోతున్నారు. ఇందుకు కారణం ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందడం. 

రాజ్యాంగంలో  చెప్పిన ప్ర‌కారం ఒక రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ల‌భించిన సంపద అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. ఈ మాట‌లే ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. అదే శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆ రోజు ఇదే చెప్పింది.  ప‌రిపాల‌న రాజ‌ధానిని జగన్ ఏమ‌యినా ఇడుపులపాయలో పెడుతున్నారా ? లేదు కదా! అందరికి అందుబాటులో ఉండే వైజాగ్ లో పెడతా అంటున్నారు. ఇందుకు విప‌క్షాల‌కు ఉన్న అభ్యంత‌రం ఏంటి ? ఈ దేశంలో చాలా రాష్ట్రాల‌లో వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి జరిగింది. క్లోస్డ్ మోడల్ అన్న‌ది అస్స‌లు ఆమోద యోగ్యం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అది అనుకూలం.

- విశాల ప్రయోజనాల కోసం సీఎం వైయ‌స్ జగన్ దేనికైనా తెగిస్తారు. ఎన్నో ఉద్యమాలు చూశాక చేసిన సీఎం వైయ‌స్  జ‌గ‌న్ చేసిన ఆలోచన ఇది.

 గ‌తంలో రాజ‌ధాని కోసం సుదూర దూరాన ఉన్న చెన్నై కు వెళ్ళాము, తరువాత 850 కి.మీ. ప్ర‌యాణించి కర్నూలు వెళ్ళాము.
అటుపై హైదరాబాద్ 800 కి.మీ. ప్ర‌యాణించి వెళ్ళాము. రాష్ట్రం విడిపోయాక ఇన్నాళ్ల‌కు మనకు ఓ మంచి అవకాశం వచ్చింది.
దీనిని అంద‌రం స‌ద్వినియోగం చేసుకుందాం. విశాఖే రాజ‌ధాని. మన ప్రాంతానికి కన్నీటి తుడవడానికి అవకాశం వచ్చింది. వ్యతిరేకించిన వారు ద్రోహులు. 

రాష్ట్రం విడిపోయాక కేంద్ర నుంచి ప‌రిహారం కింద 23 సంస్థలు ఇస్తే అందులో ఒక్కటి కూడా శ్రీకాకుళం లో పెట్టలేదు.  ఇదే విష‌యం చంద్రబాబును అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పలేదు. ఇంత క‌న్నా అన్యాయం ఇంకొక‌టి ఉందా ? 

ప్రజాస్వామ్యంలో గొంతు ఎత్తి మాట్లాడితే సాధించ‌గ‌లం. ఆ దిశ‌గా అడుగులు వేయాలి అంద‌రం. మ‌నంద‌రి ల‌క్ష్యం ఒక‌టే కావాలి రాజ‌ధాని ఏర్పాటుతో మన ప్రాంత ప్రజల జీవ‌న ప్ర‌మాణాలు పెరగాలి. అంది వచ్చిన కొడుకు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. ఆ త‌ల్లిదండ్రుల‌కు నిరీక్ష‌ణలే మిగులుస్తున్నారు.  ఈ ప‌రిస్థితులు మారేందుకు, మార్చేందుకు విశాఖే రాజ‌ధాని కావాలి. మానవ వ‌న‌రుల వినియోగం అన్న‌ది ఎక్క‌డో కాదు ఇక్క‌డే జ‌రిగి తీరాలి. అందుబాటులోకి  అవ‌కాశాలు వ‌స్తే వ‌ల‌సల నివార‌ణ అన్న‌ది సాధ్యం. 

 రాజధాని వైజాగ్  కు వస్తే రణస్థలం వ‌ర‌కూ కార్యాలయాలు వస్తాయి. అందుకే వైజాగ్ మన ప్రాంత హక్కు.అది లాక్కోకుండా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలి. మన ప్రాంత ప్రజల మేలు చేసే అవకాశం వచ్చి నప్పుడు నాకు మంత్రి పదవి పెద్దది కాదు. సీఎంని కూడా కలిసి ఇదే చెప్పాను, ప్రభుత్వం వికేంద్రీకరణకు క‌ట్ట‌బ‌డి ఉంద‌ని సీఎం చెప్పారు. 

 సాధిద్దాం సాధిద్దాం విశాఖ రాజధాని సాధిద్దాం.. 

- కొట్టొద్దు.. కొట్టొద్దు..మా కడుపులు కొట్టొద్దు..

- మోసపోయాం.. మేము ఇంకా మోసపోము

- మా గొంతు కోస్తామంటే కోటి గొంతులు గర్జిస్తాయి

- అందరం బాగుందాం అందులో మనం ఉందాం
అని ఆయ‌న నినాదాలు చేశారు.

తాజా వీడియోలు

Back to Top