సాక్షిని ఒక్కోరోజు ఒక్కో జీవోతో వేధించ‌లేదా

జీవో 2430ను ర‌ద్దు చేయాల‌ని ప‌త్రికా స్వేచ్ఛ‌కు భంగం క‌లుగుతోంద‌ని బాధ‌ప‌డిపోతున్న చంద్ర‌బాబు
నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా సాక్షి ప‌త్రిక‌పై ఎన్ని నోటీసులు పంపారో మ‌ర్చిపోయిన‌ట్టున్నారు. జ‌గ‌తి ప‌బ్లికేష‌న్‌, సాక్షి ప‌త్రిక ఈడీ, ఎడిట‌ర్ల మీద వ‌రుసగా కేసులు దాఖ‌లు చేశారు. ప్ర‌తి కేసుకు ఐఏఎస్‌లతో విచార‌ణ చేయించాల‌ని ప్ర‌త్యేకంగా జీఓలు కూడా జారీ చేశారు. `సింగ‌పూర్‌లో అమ‌రావ‌తి ప్ర‌కంప‌న‌లు` వార్త గుర్తుందా. త‌ప్పుడు ప్ర‌చారం చేస్తుంద‌న్న కార‌ణంతో సింగ‌పూర్ దేశంలో ప్ర‌తిప‌క్షంపై చ‌ర్య‌లు తీసుకుంటూ ప్ర‌త్యేక జీవో వ‌చ్చింద‌న్న విషయం బాబు తెలుసుకోవాలి. 
సాక్షి మీద చ‌ర్య‌లు తీసుకుంటూ జారీ చేసిన జీవోలు 
20.04.2018  `ప‌రిహారం మింగిన గ‌ద్ద‌లు` అనే వార్తకు కాటంనేని భాస్క‌ర్ ఐఏఎస్‌, (జీఓ 868)
18.05.2018  డాక్ట‌ర్ శ్రీధ‌ర్ చెరుకూరి, ఐఏఎస్‌ పోల‌వ‌రం గురించి (జీఓ 1088)
02.08.2018  భాస్క‌ర్ కాటంనేని ఐఏఎస్ (జీఓ 1698)
08.10.2018  శ్రీకాంత్ నాగుల‌ప‌ల్లి, (జీఓ 2151)
28.03.2018  అహ్మ‌ద్‌బాబు (జీఓ 733)
- అసెంబ్లీలో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

Back to Top