దోపిడీని బ‌య‌ట‌పెట్ట‌కూడ‌దా..? 

ఐదేళ్ల‌లో టీడీపీ డిస్క‌మ్‌ల న‌ష్టాలు రూ.29 వేల కోట్ల‌కు చేర్చింది. 

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

అసెంబ్లీ: గ‌త ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం డిస్క‌మ్‌ల‌ను రూ.20 వేల కోట్ల న‌ష్టాల్లో ప‌డేసింద‌ని, రాష్ట్రానికి గ‌త ప్ర‌భుత్వం తీవ్ర న‌ష్టం చేకూర్చింద‌ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి బుగ్గ‌న స‌మాధానం ఇచ్చారు. ప‌వ‌న విద్యుత్‌, సౌర విద్యుత్ మంచివి. పెట్రోల్‌, డీజిల్ వాడ‌కం మంచిది కాద‌నేది ప్రపంచం అంతా తెలుసు. ప‌వ‌న‌, సౌర విద్యుత్ రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ఈ రోజు అధిక ధ‌ర ప‌లుకుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న దేశాల‌తో జ‌రిగిన ఒప్పందాల ప్ర‌కారం ఈ సంవ‌త్స‌రానికి ఇంత శాతం రిన్యువ‌బుల్ ఎన‌ర్జీకి, 2020కి మ‌రో కొంత శాతం, 2023కి కొంత శాతం పోతామ‌ని 17 శాతం, 12 శాతం అని చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నాం. గ‌త ప్ర‌భుత్వం ఏ ష‌ర‌తులు పెట్టారో.. ఉదాహ‌ర‌ణ‌కు 12 శాతం అయితే.. దాన్ని మించి హ‌డావుడిగా అర్ధ‌రాత్రి ఒప్పందాలు 41 శాతం చేశారు. 2017 సంవ‌త్స‌రంలో మార్చి నెల‌కు జ‌న‌రేష‌న్ బేస్ ఇన్సెన్టీవ్ (జీబీఐ) రిన్యువ‌బుల్ ఎన‌ర్జీ ఉత్ప‌త్తి చేసే వారికి 50 పైస‌లు యూనిట్‌కు ఇస్తారు. మార్చి 2017కు ఆ కాల‌ప‌రిమితి అయిపోయింద‌ని 41 పీపీఏలు 15 రోజుల్లో ప్ర‌వేశించారు. ఏ విధంగా అంటే.. ఒప్పందం కూడా 31 మార్చిలోపు ఉత్ప‌త్తి కూడా జ‌ర‌గాలంట‌.. 15 రోజుల్లో ప‌వ‌న్ విద్యుత్ ఏర్పాటు చేసి ఎన‌ర్జీ ఉత్ప‌త్తి చేయ‌డానికి  ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం ప‌డుతుంది. 15 రోజుల్లో చేస్తామ‌ని అప్లికేష‌న్ పేడితే గ‌త ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. 

 

డిస్క‌మ్స్ ఎస్పీడీసీఎల్‌, ఈపీడీసీఎల్ వారు రిన్యువ‌బుల్ ఎన‌ర్జీ రేటు ఎక్కువ ప‌డుతుంద‌ని ఇంచుమించు రూ.4.84 ప‌డుతుంది. థ‌ర్మ‌ల్ ఎన‌ర్జీ యూనిట్ రూ.3 ప‌డుతుంది. రెండింటికి రూపాయి చిల్ల‌ర తేడా ప‌డుతుంది. ఈ ప‌రిస్థితుల్లో డిస్క‌మ్స్ ఇంత కాస్టీ విద్యుత్ మేము తీసుకోలేము అని చెప్పారు. రిన్యువ‌బుల్ ఎన‌ర్జీ ఏదైతే ఉందో.. ఎండ లేన‌ప్పుడు సౌర విద్యుత్ జీరో అవుతుంది.. గాలి లేన‌ప్పుడు ప‌వ‌న విద్యుత్ జీరో అవుతుంది. వెంట‌నే బొగ్గు నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేయాలి. ఈ బొగ్గు నుంచి ఉత్ప‌త్తి చేసేదానికి కూడా వేరేబుల్ కాస్టు, ఫిక్సెడ్ కాస్టు ఉంటుంది. ఏదైతే వాడినా.. వాడ‌క‌పోయినా జ‌న‌రేటింగ్ కంపెనీల‌కు ఇచ్చేది ఫిక్సెడ్ కాస్టు, వాడేస‌మ‌యంలో ఇచ్చేది వేర‌బుల్ కాస్టు, ఎప్పుడైతే రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ వాడుకుంటామో.. బొగ్గుది ఆపేయాల్సి వ‌స్తుంది. ఆపినా.. బొగ్గుకు సంబంధించి ఫిక్సెడ్ కాస్టు రూపాయి చిల్ల‌ర క‌ట్టాల్సి వ‌స్తుంది. ప‌వ‌న విద్యుత్‌కు రూపాయి కంటే ఎక్క‌వగా ఇస్తున్నామో.. మ‌రోప‌క్క ప్యార్ల‌ర్‌గా బొగ్గు విద్యుత్ ఆపేసినందుకు రూపాయి చిల్ల‌ర వాడ‌కపోయినా క‌ట్టాలి. రూ.2 చిల్ల‌ర యూనిట్‌కు ప‌డుతుంది అంటే ఇంచుమించు కొనుగోలు చేసే దాంట్లో స‌గ‌భాగం ప‌డుతుంది. ఇదికాక ఎప్పుడు వెన‌క్కు, ఎప్పుడు ముందుకువెళ్లాలో మ‌న‌కు తెలియ‌దు.. స‌డ‌న్‌గా చేయాల్సి వ‌స్తుంది. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని కేంద్ర ప్ర‌భుత్వం మ‌న దేశం, వేరే దేశాల‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ప్పుడు 2017కు ఇంత శాతం, 2020కి ఇంత శాతం, 2024కు ఇంత శాతం అని ఒక ఒప్పందానికి వ‌చ్చారు. దాన్ని దాటి డ‌బుల్‌కు వెళ్లారు. రిన్యూవ‌బుల్ ఎన‌ర్జీ త‌ప్పు అని అన‌డం లేదు. కాక‌పోతే దాంట్లో ప్రాక్టికాలిటీ ఉంటుంది. లేదంటే డ‌బ్బులు ఉండి కొనే ప‌రిస్థితుల్లో ఉండాలి. స్వీడ‌న్‌, ఇంగ్లాండ్ అనే దేశాలు ఉంటాయి.. వారికి ఖ‌ర్చులు ఉండ‌వు.. జ‌నాభా త‌క్కువ‌గా ఉంటారు. రూ. 3 కాకుంటే రూ.6 అయినా పెట్టి కొనుగోలు చేస్తారు. మ‌న దేశం, మ‌న రాష్ట్రానికి ఆ శ‌క్తి లేదు. ఆ శ‌క్తి త‌క్కువ‌గా కావ‌డానికి గ‌త ప్ర‌భుత్వం వేల కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్టంలోకి తీసుకొచ్చి డిస్క‌మ్‌ల‌ను కుప్ప‌కూల్చే ప‌రిస్థితి వ‌స్తే గ‌త ప్ర‌భుత్వం  క‌ట్టాల్సిన డ‌బ్బు రూ.4900 కోట్లు గ‌త నెల ఈ ప్ర‌భుత్వం క‌ట్టింది. ఈ ప‌రిస్థితుల్లో ఒక సారి దాని మీద ప‌రిశీలించి ఏదైతే ఎక్కువ రేట్ల‌కు ఇచ్చామో.. వారు, మ‌నం కూర్చొని ప్ర‌భుత్వం కొనేందుకు అవ‌కాశం ఉండేట్లు.. వారు ఇచ్చేదానికి అవ‌కాశం ఉండేట్లు.. వీటిపై నివేదిక తెప్పించుకుంటే దానికి ఏదో త‌ప్పు జ‌రిగిపోయిన‌ట్లుగా ప్ర‌తిప‌క్షం రాద్ధాంతం చేస్తుంది. 

గ‌త ప్ర‌భుత్వం ఏం దోపిడీ చేసినా ఊరికే ఉండి చ‌ప్ప‌ట్లు కొట్టాలా..? ఎటువంటి అస‌మ‌ర్థ‌త చ‌ర్య‌లు చేప‌ట్టినా బ్ర‌హ్మాండంగా చేశార‌ని చెప్పాలా..? అప్పుడు సంతోష‌ప‌డ‌తారా..? 2014-15 డిస్క‌మ్‌ల న‌ష్టాలు రూ.9 వేల కోట్లు, 2018-19 ఐదు సంవ‌త్స‌రాల పాల‌న త‌రువాత రూ.29 వేల కోట్లు... న‌ష్టాల్లోకి తెచ్చి సౌర విద్యుత్‌, ప‌వ‌న్ విద్యుత్ కొనండి అని మాట్లాడుతున్నారు. కొనేందుకు ఇబ్బంది లేదు కానీ డ‌బ్బులు ఉండాలి క‌దా.. 

ఒకవేళ అవినీతి జ‌రిగి ఉంటే దాన్ని ప‌రిశీలించి యాక్ష‌న్ తీసుకోండి అని కేంద్రం లేఖ రాసింది. అధికారులు ఎందుకు వ‌స్తున్నార‌ని ప్ర‌తిప‌క్షం అడుగుతున్నారు... అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కొన్ని స‌బ్జెక్టుల్లో ఆటోమెటిక్‌గా అధికారులు, స్పెష‌లిస్టులు ఇన్వాల్వ్ అవుతారు. అయితే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఐటీ గ్రిడ్స్ కేసు జ‌రిగిన‌ప్పుడు ఆర్టీజీఎస్ అధికారులు విజ‌యానంద్‌, అహ్మ‌ద్‌బాబు ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టారు. వారు చేస్తే బాగుంటుంది.. వేరే వారు చెబితే త‌ప్పుగా ఉంటుందా.. టీడీపీకి స‌ప‌రేట్ బిజినెస్ రూల్ బుక్ ఉందా..? 

అన్నీ ప‌ద్ధ‌తిగా జ‌ర‌గాల‌నేదానికి ఈ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది. జ‌న‌రేటింగ్ కంపెనీలకు 2014-15లో వారి బకాయిలు రూ.3910 కోట్లు, 2018-19 వ‌చ్చే స‌రికి రూ.21540 కోట్లు క‌ట్టాల్సిన ప‌రిస్థితి తీసుకువ‌చ్చారు. డిస్క‌మ్‌ల‌కు రూ.9 వేల కోట్లు ఉంటే 2018-19కి రూ.29 వేల కోట్ల‌కు తీసుకువ‌చ్చారు. గ‌తంలో ప‌వ‌ర్ స‌బ్సిడీ రూ.5 వేల కోట్లు ఉండేది.. ఇప్పుడు దాదాపు రూ.10 వేలు కావాల్సి వ‌స్తుంది. చివ‌రి సంవ‌త్స‌రంలో రూ.2500 కోట్లు కేటాయించి రూ.12 వంద‌ల కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదు. ఈ రోజు క‌రెంటు స‌ప్ల‌య్ చేయాలంటే ఎక్క‌డి నుంచి చేస్తారు. ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష జ‌రిపి రూ.4900 కోట్లు క‌ట్టామ‌న్నారు. 

Read Also: మహిళల భద్రతపై  చిత్తశుద్ధిలేని పార్టీ టీడీపీ

Back to Top