మద్య నిషేధానికి మీరు అనుకులమా..వ్యతిరేకమా?

మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ: మద్య నిషేధానికి మీరు అనుకులమా..వ్యతిరేకమా? అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ టీడీపీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు సరికాదన్నారు.ఐదేళ్లుగా వనరులను మీరు దోచుకోలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిగా ఉండి భూ కుంభకోణాలపై మీరే ఫిర్యాదు చేశారు కదా అని నిలదీశారు. ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ గేట్లు తెరిస్తే పార్టీలోకి వచ్చేందుకు 10 మంది టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీచ రాజకీయాలకు మేం పాల్పడమని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top