2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తాం

ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

పశ్చిమగోదావరి: పోలవరంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పర్యటించారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతికి సంబంధించిన విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్, అప్రోచ్‌ ఛానెల్‌ మట్టితవ్వకం పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి అనిల్‌ మాట్లాడుతూ.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు పనుల్లో పురోగతి చూపిస్తున్నామన్నారు. అప్రోచ్‌ ఛానెల్‌ మట్టితవ్వకం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. 2022 ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తిచేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి అనిల్‌ కుమార్‌ వెంట పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నాయకులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. 
 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top