టాయిలెట్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టిన ఏకైక సీఎం వైయ‌స్ జగనే

మంత్రి ఆదిమూల‌పు సురేష్  

విజయవాడ: గతంలో ప్రభుత్వాలు మరుగుదొడ్లు కట్టామా.. వదిలేశామా అన్నట్టుగా చేసేసి చేతులు దులుపుకున్నాయన్నారు. కానీ వాటి నిర్వహణపై శ్రద్ధ చూపిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని మంత్రి ఆదిమూల‌పు  సురేష్  అన్నారు. పాఠశాలల్లో టాయిలెట్ మెయిన్టెన్స్ ఫండ్‌పై జరుగుతున్న మూడు రోజుల వర్క్ షాప్‌ను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున టాయిలెట్స్  నిర్వహణపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరగటం గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో చేపట్టడానికి మనమే మార్గదర్శులం కావాలన్నారు. నాడు- నేడుతో పాఠశాలల్లో టాయిలెట్స్ రూపు మార్చివేశామని... వాటి నిర్వహణలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు.
 

తాజా వీడియోలు

Back to Top