కాపులను చంద్రబాబు దగా చేశారు..

వాస్తవాలు మాట్లాడితే టీడీపీకి ఎందుకంత అసహనం

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరిస్తోంది

మంత్రి బొత్స సత్యనారాయణ 

అమరావతిః కాపుల సంక్షేమం కోసం వైయస్‌ఆర్‌ చిత్తశుద్ధితో పనిచేశారని..కాపులు బీసీల్లో చేర్చేందుకు కమిషన్‌ ఏర్పాటు చేశారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..   కాపులను ఏవిధంగా మోసం చేశారో చంద్రబాబు  గుండెల మీద చేయి వేసుకుని సమాధానం చెప్పాలన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన తండ్రి  వైయస్‌ఆర్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రకారం ఐదేళ్లలో ఏం  చేయబోతున్నామని చెప్పామని..మోసం చేయలేదన్నారు.

చంద్రబాబు లాగా ప్రజలను మోసం,దగా చేయలేదని..నిజాయతీగా వ్యవహరిస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన  మాటలను నిలబెట్టుకుంటామని తెలిపారు.ప్రజలను టీడీపీ ఇంకా మాయ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాలను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.ప్రజలను మభ్యబెట్టి దగా చేసి ఏముఖం పెట్టుకుని టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.టీడీపీ తప్పులు ఎక్కడా బయటకు వస్తాయో అనే భయంతో అసహనంగా ఉన్నారని తెలిపారు.ప్రజల సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని..ప్రజలు ఛీ కొడతారని తెలిపారు.

 

తాజా ఫోటోలు

Back to Top