గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలను సేకరించి గత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. సంక్షేమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను, విషప్రచారాన్ని ప్రజాక్షేత్రంలో తేటతెల్లం చేస్తూ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ముందుకు సాగుతున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను ఆయా ఇళ్ల గోడలు, తలుపులపై అంటించి ప్రజామద్దతు కోరుతున్నారు. అవ్వాతాతలు, అక్కచెల్లెళ్లు, విద్యార్థులు, యువత ప్రతిఒక్కరూ సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నిండాయని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు. తమ నమ్మకం, భవిష్యత్తు, జగనన్నే అంటూ నినదిస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గం కోతపేట 1వ వార్డ్ లో "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు మునగాల మల్లేశ్వర రావు, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,వాలంటీర్లు, గృహ సారధులు పాల్గొన్నారు.