ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లక్ష్మీపార్వతి
 

విజ‌య‌వాడ‌: ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు అని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు.. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా దూరం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి పార్టీని కూలదోశారు.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించి ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన మనసున్న వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్ అని కొనియాడారు. ఆస్తులు పంచుకున్న కొడుకులు, పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వారసులు కాదని.. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్లకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు వాడటానికి  కొడుకులకు కూడా నైతిక హక్కు లేదని.. ఎన్నికలొచ్చే సరికి కొడుకులకు తండ్రి గుర్తుకువచ్చాడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలని చంద్రబాబు ఏరోజూ అడగలేదని నాటి ప్రధాని వాజ్‌పేయి తనతో స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

తాజా వీడియోలు

Back to Top