వైయస్‌ జగన్‌తో టీఆర్‌ఎస్‌ బృందం భేటీ నేడు

హైదరాబాద్‌:  జాతీయ స్థాయిలో బిజెపి,కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, బుధవారం మధ్యాహ్నం వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ కూటమి ఏర్పాటుపై టిఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే పలువురు నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా ఉంటూ ఈ రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ను కూడా కూటమిలోకి ఆహ్వానించేందుకు, కూటమి కూర్పు వంటి అంశాలపై చర్చించేందుకు వస్తామని టిఆర్ఎస్ నాయకులు వైయస్ జగన్ ను కోరడంతో ఆయన స్పందించి బుధవారం నాడు రావాలంటూ ఆహ్వానించారు. ఈ మేరకు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వైయస్ జగన్ నివాసానికి వెళ్లనుంది. కెటిఆర్ తోపాటు ఎంపి వినోద్ కుమార్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు జగన్ తో భేటీకి హాజరుకానున్నారు.

Back to Top