మరువలేని నేత..మేక‌పాటి గౌతంరెడ్డి

గౌతంరెడ్డి 2వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మ‌రువ‌లేని నేత అని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కొనియాడారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మికంగా మృతి చెంది రెండేళ్లు అయినా ఇంకా జనం గుండెల్లో గూడుకట్టుకుని ఉన్నార‌ని చెప్పారు. ఉదయగిరిలోని ఎంజీఆర్ వ్యవసాయ కళాశాలలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా మేకపాటి చిత్ర పటానికు మంత్రి పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించారు. మేకపాటి గౌతం రెడ్డి మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్నారు. రాబోయే రోజుల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళశాలను, వ్యవసాయ యూనివర్సిటీ గా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Back to Top