రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ వంటి యువ, డైనమిక్ సీఎం ఉండడం అదృష్టం 

జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్ సజ్జన్‌ జిందల్

వైయ‌స్ఆర్ జిల్లా:  రాష్ట్రానికి శ్రీ వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి వంటి యువ, డైనమిక్‌ ముఖ్యమంత్రి ఉండడం అదృష్టమ‌ని జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్ సజ్జన్‌ జిందల్ అన్నారు. వైయస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభించిన సందర్భంగా సజ్జన్‌ జిందల్ మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో మా గ్రూప్‌నకు చెందిన స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ అనేది రాష్ట్ర ప్రజలతో పాటు, జిల్లా వాసుల చిరకాల వాంఛ. ఈ ప్లాంట్‌ కోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఎంతో అంకితభావం, చిత్తశుద్దితో కృషి చేశారు. మమ్మల్ని నిరంతరం సంప్రదించారు. ఆయన చొరవ, ప్రయత్నం వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోంది.
    ఇది వైయస్సార్‌ జిల్లా. ఇక్కడ ఇవాళ ఆయనను తల్చుకోకుండా ఉంటే, ఈ కార్యక్రమం అసంపూర్తిగా ఉండి పోతుంది. దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి నాకు వ్యక్తిగత మిత్రుడు. ఆయనను ఎప్పుడు కలిసినా, మాట్లాడినా నాకెంతో సంతోషంగా ఉండేది. ఆయన నాకు ఒక మార్గదర్శకుడిగా ఉండేవారు. సీఎం శ్రీ వైయస్‌.జగన్ కూడా నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంతో నేను నా సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి బాటలో పయనిస్తున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు. 
    నేను దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగాను. చాలా మంది ముఖ్యమంత్రులను కలిశాను. అందరూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ను ప్రస్తావిస్తారు. ఆయన నాయకత్వం, పరిపాలన దక్షత గురించి చెబుతారు. ఎందుకంటే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గత మూడేళ్లుగా రాష్ట్ర జీడీపీ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణం సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పరిపాలన, అంకితభావం. ఆయన చిత్తశుద్ధితో పని చేయడం వల్లనే ఇది సాధ్యమవుతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. 
    నేను క్రితంసారి ఆయనను కలిసినప్పుడు కలిసి భోజనం చేశాం. దాదాపు గంటన్నర ఇద్దరం కలిసి ఉన్నాం. అప్పుడు ఆయన చాలా బిజీగా  ఉండడం వల్ల ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోలేక పోయాం. అయినప్పటికీ ఆ సమయంలో కూడా ఆయన మొత్తం రాష్ట్రం గురించే మాట్లాడారు. ఏ విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది? ఈ విధంగా రాష్ట్ర రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తోంది? పేద ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తోంది? విద్య, వైద్య రంగాలలో చేస్తున్న పెను మార్పులు.. ఇలా అన్ని విషయాలు చెప్పారు. వాటిన్నింటి వల్ల రాష్ట్రం ఎలా మారుతోంది అన్న విషయం కూడా ప్రస్తావించారు. 
రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం ఉంది. రాష్ట్రంలో చాలా పెద్ద పోర్టులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు ఏర్పాటువుతున్నాయి. ఒకటి ప్రైవేటు రంగంలో నిర్మిస్తుండగా, మిగిలిన మూడు ప్రభుత్వం నిర్మిస్తోంది. 
    రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి. అందరూ సంతోషంగా ఉండాలి. రాష్ట్రం అన్ని విధాలుగా ఇంకా అభివృద్ధి చెందాలన్నది తన ఆకాంక్ష అన్న సీఎంగారి మాటలు వింటుంటే.. అప్పుడు ఒక దేవుడి నోటి నుంచి అవి వచ్చినట్లుగా అనిపించాయి.
    గ్రామస్థాయిలో సేవలు, ఇంటి గడప వద్దనే ప్రభుత్వ పాలన. డిజిటల్‌ రూపంలో పంచాయతీల్లో సమగ్ర సమాచారం..వాటన్నింటి గురించి సీఎంగారు చెబుతూ పోతుంటే.. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. దురదృష్టవశాత్తూ నాకు తెలుగురాదు. నేను తెలుగులో మాట్లాడలేను. ఒకవేళ నేను తెలుగులో మాట్లాడి ఉంటే, నా ఫీలింగ్స్‌ మీరు అర్ధం చేసుకుని ఉండేవారు. రాష్ట్రానికి శ్రీ వైయస్‌ జగన్‌ వంటి యువ, డైనమిక్‌ ముఖ్యమంత్రి ఉండడం అదృష్టం. ఆయన వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటన్నది స్పష్టంగా కనిపిస్తోంది.
    జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో సీఎంగారు చాలా చిత్తశుద్దితో ఉన్నారు. అందుకే భూమి పూజ, పనుల ప్రారంభం కోసం ఆయన విజయవాడ నుంచి ఇక్కడకు వచ్చారు. ఇవాళ పనులు ప్రారంభిస్తున్న ఈ కంపెనీ, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. పెద్ద స్టీల్‌ ప్లాంట్‌గా అభివృద్ధి చెందుతుంది.
    బళ్లారిలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం నేను తొలిసారి 1995లో అక్కడికి వెళ్లాను. అప్పుడు మేము అక్కడ 1.2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణం మొదలు పెట్టాం. మొక్కలా మొదలైన ఆ ప్లాంట్‌ ఇవాళ ఒక మహావృక్షంలా ఎదిగింది. ఇవాళ ఆ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్‌ టన్నులు. వచ్చే మూడేళ్లలో ఆ ప్లాంట్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్‌గా అవతరించబోతోంది. అప్పటికి ఆ ప్లాంట్‌ సామర్థ్యం 25 మిలియన్‌ టన్నులకు చేరుతుంది. ఇవాళ ఇక్కడ కూడా ఆనాటి మాదిరిగానే అంతే సామర్థ్యంతో ప్లాంట్‌ను మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇది కూడా అలాగే ఎదుగుతుంది.
    మా నాన్నగారు ఒపి జిందల్‌ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నీవు అభివృద్ధి చెందితే, నీ చుట్టూ ఉన్న వారు కూడా బాగు పడాలని. నీవు మాత్రమే బాగు పడి, నీ చుట్టూ ఉండే సమాజంలో మార్పు రాకపోతే, నీవు నీ పని సక్రమంగా నిర్వర్తించినట్లు కాదని. 
కాబట్టి మిత్రులారా, మీకు ఒక మాట చెబుతున్నాను. ఇవాళ మేము ఇక్కడ భూమి పూజ చేస్తోంది కేవలం ఒక స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాత్రమే కాదు. ఇది జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న భూమి పూజ. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ స్టీల్‌ ప్లాంట్‌ వల్ల ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. దేశవ్యాప్తంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతుంది.
    బళ్లారిలోని విజయనగర్‌లో మా స్టీల్‌ ప్లాంట్‌ విజయానికి ఒక కారణం ఆ ప్రాంత ప్రజలు. కడపకు, బళ్లారికి చాలా పోలికలు ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలకు చాలా సామీప్యం ఉంది. వారు చాలా కష్టపడతారు. అలా పని చేసే మా బళ్లారి ప్లాంట్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ప్లాంట్‌కు ఇంఛార్జ్‌ అయిన రాజశేఖర్‌ సండూరుకు చెందిన వాడు. మా సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇస్తాం. అలా శిక్షణ పొందిన వారే మా బళ్లారి, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్‌ ప్లాంట్లలో పని చేస్తున్నారు. ఈ ప్లాంట్‌లో కూడా అదే జరుగుతుంది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ను ఒక మోడల్‌గా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ ప్లాంట్‌ గ్రీనెస్ట్‌ (పర్యావరణహిత) ప్రాజెక్టుగా నిలవబోతుంది. ఈ ప్లాంట్‌ హరిత ఇంధనం (గ్రీన్‌ ఫ్యుయెల్‌)తో పని చేస్తుంది. అందుకే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నాం.
    2023లో నిర్మిస్తున్న ప్లాంట్‌ ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్లాంట్‌గా నిలుస్తుంది. ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తైతే, ప్రపంచంలోనే ఒక మోడల్‌గా నిలుస్తుంది. దీని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో దీన్ని చూసేందుకు వస్తారు. 
    కాబట్టి మిత్రులారా సుస్థిర స్థిరత్వం, అభివృద్ధి రెండూ ఒకటిగా సాధించే దిశగా మనమంతా కలిసి పని చేద్దాం. అలాగే సంపదను కూడా కేవలం సంస్థ మాత్రమే కాకుండా, అందరం కలిసి పంచుకుందాం. మన నిర్ణయాలు, మన పని భవిష్యత్‌ తరాలకు కూడా మేలు చేయాలి. ఈ ప్రాజెక్టు మనందరికీ ఒక గర్వకారణం కావాలని ఆకాంక్షిస్తూ.. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ.. సెలవు తీసుకుంటున్నాను. 

తాజా వీడియోలు

Back to Top