డిజిపి అక్రమ నిర్మాణంపై హైకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నాం..

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి

హైద‌రాబాద్‌: పోలీసు అత్యున్నత అధికారి డీజీపీనే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో బుధవారం  ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపి డిజిపి అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంద‌న్నారు. న్యాయాన్ని కాపాడుకునేందుకే కోర్టుకు వెళ్లామ‌ని తెలిపారు.  ఏపి డిజిపిి హైద్రాబాద్ లో భారీస్దాయిలో ఇల్లు కట్టుకున్నార‌ని,  సిఎం అండగా ఉన్నారని అక్రమాలకు పాల్పడ్డార‌న్నారు. అక్రమ నిర్మాణాలు చేయడమే కాదు పక్కనే ఉన్న పార్క్ ను కూడా ఆక్రమించుకున్నార‌న్నారు.  జిహెచ్ ఎంసి పలుమార్లు నోటీసులు ఇచ్చినా , పోలీసు బాస్ ను కనుక వాటిని లెక్కచేయను అనే విధంగా వ్యవహరించార‌ని మండిపడ్డారు.ఆయన పొరుగునే ఉన్న పక్కనే ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేద‌న్నారు. పసిపిల్లలు ఆడుకునే పార్కును కూడా కబ్జా చేస్తారా అని ప్ర‌శ్నించారు. సుప్రీంకోర్టు తీ ర్పులు ఉన్నప్పటికీ పార్కులను ఆక్రమించుకోవడంలోని ఆంతర్యమేమిటని నిలదీశారు. స్వయంగా ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో ఉంటున్న...ఉండవల్లిలో రైతులు తెలుసో తెలియకో అలా నిర్మించుకుంటే వాటిని కూలగొడుతున్నార‌న్నారు.

 ఐఏఎస్ లపై ఐపిఎస్ లపై తనకు  అపార గౌరవం ఉందని, వారు ఉన్నత స్థానాలలో ఉంటూ ఆయా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అమలు చేయాలని వారి మాన్యువల్స్ లో కూడా స్పష్టంగా ఉంద‌న్నారు. వాటిని ఖాతరు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.చట్టాలను ఉల్లంఘిస్తూ చట్టాలను కాపాడతాను అని చెప్పడం ఏమాత్రం సమంజసం అని ప్ర‌శ్నించారు.

సమాచార హక్కు చట్టం కింద , ఒక ప్రజా ప్రతినిధిగానూ సమాచారం కోరితే 15 రోజులలో సమాచారం అందిచాల్సి ఉన్నా స్పందించడం లేదన్నారు.  2014 నుంచి ఎంతమంది ఎస్ ఐ,సిఐ,డిఎస్పిలు బదిలకు సంబంధించి,  ఆర్టిఐ కింద సమాచారం అడిగితే ఇవ్వలేద‌న్నారు. ఏసిబి ఆడిషనల్ డిజిగా,రాష్ట్ర డిజిపిగా పదవులు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా చట్టాలతో సంబంధం లేకుండా పనిచేస్తారనే ఆయనకు ఈ పోస్టింగులు ఇచ్చారని తీవ్రంగా ఆరోపించారు. 

Back to Top