మీ పరిపాలనకు ఇవే నా శుభాకాంక్షలు

సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసిన నటుడు మంచు మనోజ్‌
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సినీ హీరో మంచు మనోజ్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మనోజ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 

''సీఎం వైయ‌స్ జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకున్న దార్శనికతకు ముగ్దుడినయ్యాను.  మంచి చేస్తున్న మీలాంటి వ్యక్తికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మీ పరిపాలనకు ఇవే నా శుభాకాంక్షలు '' అని మ‌నోజ్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top