అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారని గూడురు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత విగ్రహ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. శాసన సభలో కూడా మహాత్మాగాంధీ ఫోటో పక్కన బీఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని కోరారు. సమాజంలో అందరూ సమానమే. సీఎం వైయస్ జగన్ దళితుల సంక్షేమ కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయమన్నారు. రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకోవడం అందరి బాధ్యత అన్నారు. అన్ని వర్గాలనూ సమానంగా చూసేవాడే నాయకుడు. సీఎం వైయస్ జగన్ సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు.