తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) వేలూరు, చిత్తూరు క్యాంపస్ ప్రతినిధుల బృందం కలిసింది. సీఎంసీ వేలూరు ఆసుపత్రికి అనుబంధంగా ఏపీలో ఉన్న చిత్తూరు క్యాంపస్ అభివృద్దిపై ముఖ్యమంత్రితో వారు చర్చించారు. చిత్తూరు క్యాంపస్‌లో మెడికల్ సెంటర్‌తో కూడిన మెడికల్ కాలేజ్, హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్, ఆరోగ్య సేవలకు అనుబంధంగా ఉండే కోర్సులతో కూడిన కాలేజ్‌ల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాల్సిందిగా సీఎంకి విజ్ఙప్తి చేశారు. ఇందుకు సీఎం వైయస్ జగన్, సానుకూలంగా స్పందించారు. సీఎంసీకి ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు వెల్లడి. సీఎంసీ ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని, ఏపీ ఆరోగ్య రంగంలో ఇదొక గొప్ప విజయంగా భావిస్తున్నామన్న ముఖ్యమంత్రి . ఇప్పటికే చిత్తూరులో సెకండరీ కేర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు, దానిని అతి త్వరలో 300 పడకల ఆసుపత్రిగా విస్తరించనున్నట్లు సీఎంకి వివరించిన సీఎంసీ టీమ్ ఈ సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సీఎంసీ డైరెక్టర్ డా.విక్రమ్ మాథ్యూస్, మాజీ డైరెక్టర్ డా.సురంజన్ భట్టాచార్య, ప్రిన్సిపాల్ డా.సోలోమన్ సతీష్ కుమార్, సీఎంసీ చిత్తూరు క్యాంపస్ అసోసియేట్ డైరెక్టర్ డా.కెన్నీ డేవిడ్, డా.జాయ్ మమ్మీన్, నిర్మలా మార్గరేట్, హెప్సీ పాల్గొన్నారు.