సీఎం రాకతో నరసాపురం రూపురేఖలు మారిపోయాయి

ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి

రూ.3,300 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎంకు కృతజ్ఞతలు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముద్దనూరు ప్రసాదరాజు 

నరసాపురం: వంద సంవత్సరాల క్రితం బ్రిటీష్‌ వారు వ్యాపారం, వాణిజ్యం నరసాపురం నుంచి కొనసాగించారు. మళ్లీ వంద సంవత్సరాల తరువాత నరసాపురం రూపురేఖలు సీఎం వైయస్‌ జగన్‌ రాకతో మారబోతున్నాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముద్దనూరు ప్రసాదరాజు అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురుచూస్తున్న ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయన్నారు. రూ.3,300 కోట్ల నిధులతో నరసాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు నరసాపురం నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 

నరసాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘జిల్లాల పునర్విభజన సమయంలో నరసాపురంను జిల్లా హెడ్‌క్వార్టర్‌ చేయమని కోరాం. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఆరోజున అన్న మాట ఈరోజుకీ గుర్తుంది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మన ప్రభుత్వ ధ్యేయం, నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. పెట్టే మనసు ఉంటే చివరి బంతిలో కూర్చున్నా.. సంతృప్తిగా భోజనం చేయొచ్చు. ఆరోజున ఎవరైతే విమర్శలు చేశారో.. వారికి ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నరసాపురం రూపురేఖలు మార్చి సమధానం చెప్పబోతున్నాం. సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. ఒకపక్క గోదావరి, మరోపక్క సముద్రం, ఇంకో పక్క ఉప్పుటేరులు ఉన్నా కలుషిత నీటిని తాగుతున్నాం. కాలుష్యనీటిని అరికట్టేందుకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వద్దకు వెళ్లి విజ్జేశ్వరం నుంచి పైపులైన్‌ ద్వారా మంచినీరు ఇవ్వాలని కోరాం. 

ఆరోజున బీజం పడింది. ఈ రోజున కార్యరూపుం దాల్చుతుంది. రూ.1400 కోట్లతో జిల్లాలోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన మినరల్‌ వాటర్‌ ఇచ్చే ప్రాజెక్టును సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫిషింగ్‌ హార్బర్‌ కమ్‌ కార్గోబోట్‌కు రూ.450 కోట్లతో సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. భారతదేశంలోని మూడవ ఆక్వాయూనివర్సిటీని నరసాపురంలో ఏర్పాటు చేసుకోవడం తీర ప్రాంత మత్స్యకారులకే కాకుండా ఆక్వారంగంలోని ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడుతుంది. 

మత్స్యకారులను, ఆక్వారైతులను గుర్తించి ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందో ప్రజలు గమనించాలి. నరసాపురంలో 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వంద సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నా.. వారికి భూమి మీద హక్కు లేక, లోన్లు రాక, రిజిస్ట్రేషన్లు జరగక ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. 1685 మందికి రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు అందిస్తున్నాం. మున్సిపాలిటీ ఏర్పడి 75 సంవత్సరాలు అయ్యింది. ఆరోజున నిర్మించిన మంచినీటి చెరువు, డ్రైనేజీ సిస్టమ్‌ ఉంది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రూ.87 కోట్లు, మంచినీటి స్కీమ్‌ కోసం రూ.62 కోట్లు కేటాయించారు. గోదావరి కరకట్ట కోసం రూ.35 కోట్లు మంజూరు చేశారు. నియోజకవర్గంలోని చాలా ప్రధాన కార్యక్రమాలకు సీఎం వైయస్‌ జగన్‌  చేతుల మీదుగా శంకుస్థాపనలు అయ్యాయి. ఇవన్నీ సంవత్సరన్నరలో పూర్తవుతాయి’ అని ముద్దనూరు ప్రసాదరాజు అన్నారు. 
 

Back to Top