అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యక్తిగత కక్ష ఎందుకుంటుందని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) ప్రశ్నించారు. చంద్రబాబు ఏదో అరెస్ట్ అయ్యాడూ.. దానిపై ఎదోటి మాట్లాడమని పక్క రాష్ట్రం నేతలను బ్రతిమాలుతున్నారు. అందుకే కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు.. బాబుతో పాటు జైలుకెళ్తారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం ఎవరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు చేస్తారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మ కులస్తులు మాత్రమే. మా వాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయి. పొరుగు దేేశాలు.. రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలేమైనా నిరసనలు చేస్తున్నారా..? చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వలేదు.’ అని కొడాలి నాని పేర్కొన్నారు. మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తిరుణాల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తున్న లోకేశ్: లోకేశ్ పేరును మేం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ చిత్తు కాగితం మీద కూడా రాయం. ఈయన పాదయాత్ర మళ్లీ మొదలు పెడుతున్నాడని సీఐడీ రాత్రంతా కూర్చుని 2వేల పేజీలు తయారు చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇరికించారా? ఆయన పెద్ద పెద్ద ఎర్రబుక్కులు పెట్టుకుని మా పేర్లు రాసుకుంటాడు. వాళ్ల నాన్నను అరెస్టు చేయగానే తిరణాల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూస్తున్నాడు. ఆయనెవరో పెద్ద స్టార్ వెళ్తే అన్నయ్య అంటూ పక్కన మామను పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తానన్నాడు. ఇప్పుడు మా నాన్న మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు అంటున్నాడు..ఏం నీకు వద్దా పెద్ద పదవి? ప్రతి రిమాండ్ ఖైదీ జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. ఎవరికైనా అది రూల్. లేదు ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే కోర్టులో పిటిషన్ వేసుకుంటే వెసులుబాటు ఇస్తారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే జైల్లో సౌకర్యాలు కల్పిస్తారు. నిన్న భువనేశ్వరి గారు మాట్లాడుతూ వేడినీళ్లు ఇవ్వడం లేదంటారు.. దోమలు కుడుతున్నాయి అంటున్నారు..దోమలు కుట్టక రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారా ఏంటి..? ఈయన దోమల మీద దండ్రయాత్ర చేశాడు కదా అవన్నీ పగబట్టి ఉంటాయి. ఒక కత్తి పట్టుకుని దోమల కోసం తిరిగాడు కదా..అక్కడ చాకు తీసుకుని దోమల్ని పొడవాల్సింది. 40 ఏళ్లుగా లేని వ్యక్తిగత కక్ష ఇప్పుడే వచ్చిందా..?: చంద్రబాబు, రాజశేఖరరెడ్డి గారు ఇద్దరూ శాసనసభ్యులుగా ఒకరు అధికార పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తే..ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే వైఎస్సార్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వైఎస్సార్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉంటే జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. 40 ఏళ్ల నుంచీ రెండు కుటుంబాలు విరుద్ధమైన పార్టీల్లో ఉన్నాయి. అప్పుడెప్పుడూ లేనటువంటి వ్యక్తిగత కక్ష ఇప్పుడెందుకు వస్తుంది..? అంటే చంద్రబాబు వ్యక్తిగత కక్షతో జగన్ గారిని కాంగ్రెస్‌తో కలిసి అరెస్ట్ చేయించాడా..? అప్పుడు సోనియా గాంధీ జగన్ గారిని అరెస్టు చేయించిన దాంట్లో ఈయనకు కూడా బాగస్వామ్యం ఉందా? ఎందుకు అనుకుంటున్నాడు వ్యక్తిగత కక్ష అని...ఏం వ్యక్తిగత కక్ష ఉందో ఆయనే చెప్పాలి. ఎవడి మీదనో ఆధారపడి బతికే బాబును చూసి మాకెందుకు కక్ష..?: చంద్రబాబు 23 సీట్లకు పరిమితమై..పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయాడు. పోటీ చేసిన చోట ఒక్కటి కూడా గెలవలేకపోయాడు... సాంతం సంకనాకి పోయి ఎవడిమీదనో ఆధారపడి బతకాల్సిన పరిస్థితికి వచ్చిన చంద్రబాబును చూడలేక జగన్ గారు అరెస్టు చేయించాడా? ఆల్ రెడీ 74 ఏళ్ల వయసు..కాటికి కాళ్లు చాపి ఉన్నాడు.. పార్టీని సర్వనాశనం చేశాడు..కుప్పంలో కూడా అతను గెలిచే పరిస్థితి లేదు.. అలాంటి వ్యక్తిపై ఎందుకు వ్యక్తిగత కక్ష ఉంటుంది...? ఏ నేరం చేయకుండా ఎందుకు పెడతారు కేసు..? అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టారు అంటే ఎలా..? ఏసీబీ కోర్టులో జడ్జి పరిశీలించలేదా? క్వాష్ చేయమని వీళ్లు హైకోర్టుకు వెళ్లలేదా? ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను కూడా పట్టుకొచ్చాడు కదా. పక్కాగా దొంగలా ఆధారాలతో దొరికిపోయాడు.. చంద్రబాబు తెలివైనవాడు..గతంలో 10, 15 శాతం కమీషన్ తీసుకుని బతికే వాడు. కొడుకు, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఈ కమిషన్ తక్కువ అని డైరెక్ట్‌గా మొత్తం ఎత్తేశారు. ఆయన కుటుంబ సభ్యులు చేసిన స్కాంకి చంద్రబాబు బలైపోయి జైళ్లో ఉన్నాడు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యమే: మేం మొదటి నుంచీ చెప్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధానితో పాటు అన్నిటిలో స్కాం ఉంది. చంద్రబాబు మాత్రం మేకపోతు గాంభీర్యంతో ఉంటున్నాడు. ఆయన నమ్మకం తాను ప్రతిపక్ష నాయకుడిని, నాజోలికి ఎవరూ రారు అని నమ్మకంతో ఉన్నాడు. అందుకే నేను ఎన్ని దొంగతనాలు, దోపిడీ చేసినా నా జోలికి రారు అని భావించాడు. నా జోలికి వస్తే రాజకీయంగా ప్రత్యర్థులకు మైనస్ అవుతందని భావించాడు. అందుకే నీ బాబే ఏం చేయలేకపోయాడు..నువ్వేం చేస్తావ్ అంటూ బీరాలు పలికాడు. బాలయ్య డైలాగ్‌లా ఫ్లూట్ వెళ్లి జింక ముందు ఊదాలి కానీ ఈయన సింహం ముందు ఊదాడు. దీంట్లో వ్యక్తిగతంగా చంద్రబాబుపై మాకు ఎటువంటి ధ్వేషం లేదు. చంద్రబాబు వాళ్ల పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తాడని వాళ్లకే నమ్మకం లేదు. ఇక మాకైతే చంద్రబాబు అధికారంలోకి వస్తాడనే నమ్మకం అసలే లేదు. ఇక మాకెందుకు ఆయనపై వ్యక్తిగత కక్ష ఉంటుంది..? ఈ రాష్ట్రంలో మేం అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. ఆయనుంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. టీడీపీని చంద్రబాబు ఒక కుల పార్టీగా మార్చేశాడు: చంద్రబాబుకు జనంలో ఏమీ ఉండదు..ప్రచారంలో దిట్ట. చంద్రబాబు ఒక మానిప్లేటర్..మ్యానేజ్ చేసే వ్యక్తి. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతల వద్దకు వెళ్లి బతిమిలాడితే వాళ్లు దయతో ఒక ట్వీట్ పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు సారధ్యంలో ఒక కుల పార్టీగా మార్చారు. వాస్తవంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు బడుగు, బలహీనవర్గాల కోసం పార్టీ అన్నాడు. రాజకీయాల్లో బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. టీడీపీ చంద్రబాబు సారధ్యంలోకి వచ్చిన తర్వాత ఒక్క ముగ్గురు నలుగురు బడుగు, బలహీనవర్గాల కన్నా రాజ్యసభ సీట్లు ఇచ్చాడా..? ప్రస్తుతం అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేస్తుంది బడుగు బలహీన వర్గాలా..? హైదరాబాద్, బెంగుళూరు..ఇలా అన్ని చోట్లా వాళ్లే చేస్తున్నారా..? రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలు చంద్రబాబు కోసం ఏనాడూ పాదయాత్రలు చేయరు. కార్లు యాత్ర అంటేనే అర్ధం అవుతుంది...కార్లు డబ్బులున్నవారికి, మా వాళ్లకు ఉంటాయి. బాబుతో నేను...అంటే అందరూ ఆయనతో పాటు జైలుకు వెళ్లాలా..?