నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవలేదు

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

విశాఖ‌: నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవలేద‌ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో మంత్రి మాట్లాడారు.

మంత్రి బుగ్గ‌న్న ఏమ‌న్నారంటే..

 • గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  కు విచ్చేసిన మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం.
 • బిజినెస్, కామర్స్, ట్రేడ్స్, ఇండస్ట్రీస్ అన్నీ పలు ప్రాంతాల్లో, వివిధ ప్రయోజనాల పరంగా విస్తరించి ఉన్నాయి. 
 • ముడి సరుకు లభ్యత కావచ్చు, విస్తృత మార్కెట్ అవకాశాలు, మానవ వనరుల లభ్యత, పర్యావరణ అనుకూలత, రాజకీయ సుస్థిరత కావచ్చు వివిధ కారణాలతో  అక్కడ పెట్టుబడులు పెడుతుంటారు. 
 • వలసలను ప్రోత్సహించడం ద్వారా యురోపియన్ దేశాలు భారీగా పరిశ్రమలను ఏర్పాటు చేసాయి. యూఎస్, జపాన్, కొరియా, చైనా వంటి దేశాలన్నీ ఇందుకు ఉదాహరణలే. అవకాశాలు ఎక్కడుంటే అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. 
 • ఇదే విధంగా స్వాతంత్రానికి ముందు కూడా భారత్ లో ఎన్నో రాష్ట్రాల్లో, నగరాల్లో లభ్యమైన సహజ ప్రయోజనాలతోనే వివిధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 
 • ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే సమృద్ధే శ్రేయస్సు అందిస్తుందని అని చెబుతాం. 
 • మా రాష్ట్రానికి ఉన్న సహజసిద్ధమైన వనరులు  మా బలం అని చెబుతాం.
 • వ్యవసాయ ఉత్పత్తులు, సంబంధిత రంగాల్లో దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ స్థిరంగా కొనసాగుతోంది. 
 • కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల్లో ముందంజలో ఉంది. 
 • అద్భుతమైన పర్యావరణం ఫార్మా, ఆటోమొబైల్ రంగాలు విస్తరించేందుకు అనుకూలంగా ఉంది. 
 • లాజిస్టిక్స్ పరంగా చూసినా పోర్టు కనెక్టివిటీ, రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి.
 • వర్క్ ఫోర్స్ విషయంలోనూ ఏపీ అగ్రగామిగా ఉంది.
 • స్థిరమైన ప్రభుత్వం, వ్యాపార, పారిశ్రామిక రంగంపై అవగాహన కలిగిన డైనమిక్ సీఎం ఈ రాష్ట్రానికి ఉన్నారు. 
 • కాస్మోపాలిటిన్ సిటీ విశాఖ పర్యావరణపరంగానే కాక అన్ని విధాలా పారిశ్రామిక పెట్టుబడులకు అనువైనది. 
 • ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూర్, హైదరాబాద్ మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సెటిల్ అవుతున్న మహానగరం విశాఖ.
 • ఐటీ రంగానికి విశాఖ పట్టుకొమ్మ. 
 • మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ గా ఉంది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై మేం దృష్టి కేంద్రీకరించాము.  
 • విభజన అనంతరం ఏపీలో పారిశ్రామిక ప్రగతిని పునర్నిర్మించే లక్ష్యంతో మా ప్రభుత్వం, సీఎం వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారు. 
 • వ్యాపారఅభివృద్ధికి అనంతమైన అవకాశాలు అందించేందుకు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు అందించేందుకు, సేవారంగంలో దేశంలోనే కాదు, ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచేందుకు, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే నడిపించే ప్రజా ప్రభుత్వాన్ని నిర్మించేందుకు ఈ రాష్ట్రం కట్టుబడి ఉంది. 
 • పెట్టుబుల స్వర్గధామం విశాఖకు మీ అందరికీ  మరోసారి స్వాగతం.
Back to Top