గిరిజ‌నుల‌కు వ్య‌వ‌సాయ భూమి ప‌త్రాల పంపిణీ

మంజూరు ప‌త్రాలు అంద‌జేసిన ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు
 

పార్వ‌తీపురం:  గిరిజ‌నులు సాగు చేసుకుంటున్న పోడు భూముల‌కు స‌ర్వ‌హ‌క్కులు క‌ల్పిస్తామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన హామీని నెర‌వేర్చుతూ వ్య‌వ‌సాయ భూముల‌ను పంపిణీ చేశారు. వ్య‌వ‌సాయ భూముల మంజూరు ప‌త్రాల‌ను సోమ‌వారం ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు గిరిజ‌నుల‌కు అంద‌జేశారు. పార్వతీపురం మండలం, అడారు గిరిజన గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిపై రైతులకు హక్కును కల్పిస్తూ రెవిన్యూ శాఖ మంజూరు చేసిన వ్యవసాయ భూమి మంజూరు పత్రాలను ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు చేతులు మీదుగా క్యాంప్ కార్యాలయంలో గిరిజనులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ..గిరిజనుల దీర్ఘకాల ఆశను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని కొనియాడారు. 

తాజా వీడియోలు

Back to Top