తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లిఖార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.