తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (01.08.2023) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలో వివిధ అభివృద్ది పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకోనున్న సీఎం, ముందుగా కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు, అనంతరం హై–టీలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.