మేం వ‌చ్చాక రూ.2,250 చొప్పున పింఛ‌న్ ఇస్తున్నాం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 

అమ‌రావ‌తి:  మేం అధికారంలోకి వ‌చ్చిన మొట్ట మొద‌టి నెల నుంచే రూ.2250 పింఛ‌న్ అందిస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. చంద్ర‌బాబు హ‌యాంలో రూ.వెయ్యి పింఛ‌న ఇచ్చేవార‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు వ‌ర‌కు 44,32,592 పింఛ‌న్లు ఉండేవ‌ని, ఇప్పుడు 61.94 ల‌క్ష‌ల పింఛ‌న్లు పంపిణీ చేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. చంద్ర‌బాబు హ‌యంలో పింఛ‌న్ల‌కు నెల‌కు రూ.500 కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌ని, మేం వ‌చ్చాక నెల‌కు రూ.1500 కోట్లు ప్ర‌తి నెల పింఛ‌న్ల‌కు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.

Back to Top