సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం వైయస్‌ జగన్‌

 గుడివాడ: మంత్రి కోడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు పూర్ణ కుంభంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశీర్వదించారు. అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులను సీఎం తిలకించారు. కోలాటం ఆడుతున్న చిన్నారులను వైయస్‌ జగన్‌ మెచ్చుకున్నారు. ఒంగోలు గిత్తలను పరిశీలించారు. అనంతరం గంగిరెద్దుల ప్రదర్శనను తిలకించారు. 

Back to Top