మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ మృతిపై సీఎం దిగ్భ్రాంతి

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్వీ ప్రసాద్‌ మృతికి సంతాపం తెలుపుతూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరిపాలనలో ఎస్వీ ప్రసాద్‌ తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. కరోనాతో గత కొద్ది రోజులుగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్వీ ప్రసాద్‌ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top