చంద్రబాబుకు న‌ర‌కంలోనూ చోటు దొరకదు

కళ్ల ముందున్న అంశాన్ని కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నాడు

కళ్లు కనిపించడం లేదా..? కళ్లద్దాల సైజు సరిపోవడం లేదా..?

బాబు తీరుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం

అసెంబ్లీ: మేనిఫెస్టో కళ్లముందు కనిపిస్తున్నా.. కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబుకు నరకంలో కూడా చోటు దొరకదు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ అని చెప్పామన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఏం మాట్లాడానో అసెంబ్లీలో స్పీకర్‌ అనుమతితో ప్రసారం చేయిస్తా.. మేనిఫెస్టోలో ఏం పొందుపరిచామో చదివి వినిపిస్తా.. ‘పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించే ఒక్కో ఇల్లు 300 అడుగులట. అడుగుకు రూ.2 వేలతో పేదలకు అమ్మారు. ఇందులో రూ.3 లక్షలు పేదవాడి పేరుతో అప్పుగా రాసుకొని, ఆ అప్పు భారం 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.3 వేలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి. ఆ అప్పుభారం రద్దు చేసి.. ఆ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది’ అని మేనిఫెస్టోలో పెట్టాం. మరి చంద్రబాబు కళ్లు కనిపించడం లేదా..? 300 అడుగులు అనేది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో 300 అడుగులు అని క్లియర్‌గా కనిపిస్తుంటే చంద్రబాబు కళ్లు కనిపించడం లేదో.. కళ్లద్దాల సైజు సరిపోవడం లేదో.. లేదా బాబు బుర్రలో పూర్తిగా వక్రీకరణ, కుళ్లు, కుట్ర ఎదిగి కళ్లముందు ఉన్నది కూడా కనిపించని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top