రేపు, ఎల్లుండి సీఎం వైయ‌స్ జగన్‌ ఢిల్లీ పర్యటన 

తాడేపల్లి : ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఎల్లుండి(మంగళవారం) కూడా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. రేపు సాయంత్రం సీఎం వైయ‌స్‌ జగన్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

రాత్రికి జన్‌పథ్‌ నివాసంలో సీఎం వైయ‌స్ జగన్‌ బస చేయనున్నారు. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు సీఎం వైయ‌స్ జగన్‌ హాజరుకానున్నారు. ఎల్లుండి 10.30-5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం వైయ‌స్ జగన్‌ సమావేశమవుతారు. 

Back to Top