అండ‌గా నిలిచిన‌ సీఎం వైయ‌స్ జగన్‌ భరోసా  

 గుంటూరు  :  అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి నేనున్నానంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌ అండగా నిలిచారు. తలసేమియాతో బాధపడుతున్న విజయవాడకు చెందిన దుర్గాభవానీ, సీతారామ్‌ దంపతులు కుమారుడు గౌతమ్‌వెంకట్, బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన సూర్యఆదిత్యరెడ్డి, ప్రమాదంలో కళ్లు కోల్పో­యి, మానసిక స్థితి సరిగా లేని దుగ్గిరాలకు చెందిన  నాగూర్‌తో పాటు కుమార్తె త్రివేణిలు వెంకటపాలెం వద్ద సీఎం వైయ‌స్ జగన్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు ఓపికగా విన్న సీఎం.. తక్షణ ఆర్థిక సాయంతో పాటు  మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించా­రు. ఈ మేరకు గంటల వ్యవధిలోని ఆయా జిల్లా­ల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.  వైద్యం అందిస్తామన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top