కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు. ఈనెల 28వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభను జ్యోతిప్రజ్వలన చేసిన ప్రారంభించిన సీఎం.. కర్నూలు ఎయిర్‌పోర్టు శిలాఫలకాన్ని ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 

 

Back to Top