తాడేపల్లి: ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. తన పాలనతో అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొన్న సీఎం వైయస్ జగన్‌కు తమిళనాడు వాసులు సైతం అభిమానులుగా మారుతున్నారు. ఈనెల 21వ తేదీన జననేత పుట్టిన రోజును పురస్కరించుకొని తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వారిలో కొందరు తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ల అప్పిరెడ్డిని కలిసి.. తమిళనాడులో తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం తిరుత్తణికి చెందిన అభిమాని కె.ప్రభు, అరక్కోణంకు చెందిన పులియందిరన్ ఆధ్వర్యంలో సీఎం వైయస్ జగన్‌పై రూపొందించిన ఆడియో, వీడియో సీడీని అప్పిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీదేవి, గణపతి, హేమంత్‌రెడ్డి, మణికంఠన్, కాటురాజా తదితరులు పాల్గొన్నారు.