క‌ళాత‌ప‌స్వి విశ్వనాథ్‌ మరణం తీవ్రవిచారానికి గురిచేసింది

తాడేప‌ల్లి: క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. విశ్వ‌నాథ్ మృతికి సంతాపం తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు`` అని సీఎం ట్వీట్ చేశారు. 

Back to Top