మైనార్టీ సంక్షేమ దినోత్సవానికి హాజ‌రైన సీఎం వైయస్‌ జగన్‌

విజ‌య‌వాడ‌: భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుక‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో చేరుకున్నారు. స్టేడియంలో నిర్వ‌హిస్తున్న‌ మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే ఉత్స‌వాల‌కు హాజ‌ర‌య్యారు. వేదిక‌పై ఏర్పాటు చేసిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌కు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను వైయ‌స్ఆర్ సీపీ మైనార్టీ నేత‌లు ఘ‌నంగా స‌త్క‌రించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top