తాడేపల్లి: జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం శ్రీ వైయస్ జగన్ అభినందించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఫౌండర్ ఆదిత్య మెహతా కలిశారు. బేబి రెడ్డి స్వస్ధలం అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లె, షేక్ అర్షద్ స్వస్ధలం నంద్యాల. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో (జూనియర్స్ టీమ్)లో కాంస్య పతకం గెలిచిన బేబి రెడ్డి టీమ్, తాను సాధించిన పతకాలను సీఎం శ్రీ వైయస్ జగన్‌కు చూపిన బేబి రెడ్డి, జాతీయ స్ధాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్ళిన బేబి రెడ్డి, ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించిన షేక్ అర్షద్. తాను జాతీయ స్ధాయిలో సాధించిన పతకాలను కూడా సీఎంకి చూపిన అర్షద్, అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు సీఎంకి వివరించిన అర్షద్ తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎంని కోరిన బేబి రెడ్డి, అర్షద్, సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి. బేబి రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామి రెడ్డి, అర్షద్ కోచ్ ఆదిత్య మెహతా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.