జగనన్న పారదర్శకపాలనతో బలహీనులకు బలం వచ్చింది 

 కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడని సీఎం వైయ‌స్ జగన్‌: మంత్రి మేరుగ నాగార్జున 

 దేశంలో సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక సీఎం జగనే: మంత్రి జోగి రమేష్ 

 అంబేద్కర్‌ కలలు సాకారం చేసిన యువనేత సీఎం జగన్‌: ఎంపీ మోపిదేవి వెంకటరమణ 

 నిరుపేద కూలీ కొడుకును ఎంపీగా చేసిన ఘనత జగనన్నది: ఎంపీ నందిగం సురేష్ 

  సామాజిక విప్లవం తెచ్చిన ధీరుడు జగనన్న: ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి 

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర 

పామర్రు: సామాజిక సాధికార బస్సుయాత్రతో పామర్రు పరవశించిపోయింది. పట్టణంలో ఇసకేస్తే రాలనంతగా ప్రజలు తరలి వచ్చారు. సభావేదిక వద్దకు యాత్ర చేరుకొనేదాకా రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. నేతల ప్రసంగాలు ముగిసేదాకా ప్రజలు సభాప్రాంతంనుంచి కదల్లేదు. జోహార్‌ వైయస్సార్, జై జగన్‌ నినాదాలతో పామర్రు మార్మోగింది. వేలాది మంది రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్తజోష్‌ వచ్చింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్‌ కుమార్, కొలుసు పార్థసారథి, ముస్తఫా, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ హారిక తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే..

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ...
– దేశ చరిత్రలో అంబేద్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్‌ రామస్వామి, బాబూజగ్జీవన్‌ రామ్, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ లాంటి వారు సామాజిక విప్లవం కోసం ఉద్యమాలు చేశారు. 
– నాటి మహానుభావులు కోరుకున్న ఆలోచనా విధానంతో.. బలహీన వర్గాలు ఉన్నతంగా ఉండాలని సీఎం జగన్‌ సంకల్పించారు.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు.
– కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలు. అట్టడుగు కులాల అభ్యున్నతి సాకారమైంది.
– 2014లో జగనన్నపై పోటీకి మూడు పార్టీలు కలిసి వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు. 
– రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, 20 పైసలకే మంచినీరు ఇస్తానని ఇవ్వలేదు.
– బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు చెప్పాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలమీద కత్తివేటు వేశాడు చంద్రబాబు.
– చీము, రక్తం ఉన్న ఎస్సీలు, రాష్ట్రంలో చంద్రబాబు పంచన ఉండరు. చంద్రబాబుకు ఓటు వెయ్యరు.
– రాష్ట్రంలో పేదరికాన్ని జగనన్న 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. 
– దేశంలోనే ఏ ఆస్పత్రికైనా వెళ్లి బహ్మాండంగా చూపించుకునేలా ఖర్చులకు డబ్బులిస్తోంది జగనన్న ప్రభుత్వం. 

 మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.... 

– దేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులుంటే సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే.
– సామాజిక న్యాయం అంటే ఈ విధంగా ఉంటుందని రుచి చూపించిన వ్యక్తి జగనన్న.
– 25 మంది మంత్రివర్గం ఉంటే అందులో 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారు.
– స్పీకర్‌ బీసీ, మండలి చైర్మన్‌ ఎస్సీ, మండలి వైస్‌ చైర్మన్‌ పదవి మైనార్టీకి ఇచ్చారు.
– షణ్ముఖ వ్యూహం అని పవన్‌ అంటున్నాడు. నిజానికి అది చీటర్స్‌ వ్యూహం.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్నదమ్ముల ఊపిరి జగనన్న. 
– చంద్రబాబు, పవన్, లోకేష్, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు.. ఆరుగురు కలిసి వ్యూహం పన్నినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్నదమ్ముల ధాటికి తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.
– సాధికార యాత్రల్లో జగనన్న కటౌట్‌ చూసే వేలాది మంది తరలి వస్తున్నారు.
– జగనన్న వస్తే మీరు తట్టుకుంటారా? సునామీ ధాటికి కొట్టుకుపోతారు.
– ప్రతిపక్షాలు ఏ వ్యూహం పన్నినా, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగనన్న వ్యూహమే మా వ్యూహం. 
– నేడు మన పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు. మంచి వైద్యం అందుతోంది. 
– మోపిదేవి, బోస్, కృష్ణయ్య, మస్తాన్‌రావు.. నలుగురు మన బిసివర్గాల వారు రాజ్యసభ మెట్లు ఎక్కారంటే కారణం జగనన్న.
– వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్‌కు ఎంపీ సీటు అమ్మేసుకున్నాడు.

 ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. .

– స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు అనేక మంది నాయకుల ఉపన్యాసాల్లోనే సామాజిక సాధికారత విన్నాం. 
– 2019లో జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సామాజిక సాధికారత అనే పదానికి 100 శాతం న్యాయం చేసి చూపారు.
– అంబేద్కర్‌ కలలు సాకారం చేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. 
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను అన్ని విధాలుగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకొనేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 
– అగ్నికుల క్షత్రియ వర్గం నుంచి నేను, గౌడ వర్గం నుంచి పిల్లి సుభాష్, యాదవ వర్గం నుంచి బీద మస్తాన్‌రావు, కురుబ వర్గం నుంచి ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభలో అడుగుపెట్టే అరుదైన అవకాశం కల్పించారు.

 ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ..... 

– ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలపై వివక్ష చూపిన చంద్రబాబు.
– జగనన్నకు పేదవాడి కష్టం తెలుసు. చమట వాసన తెలుసు. ఆయనకు కావాల్సింది అట్టడుగున ఉన్న ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీల్లోని పేదవారి అభ్యున్నతి.
– ఒక సామాజిక వర్గంలో కొంతమందికి రాష్ట్ర సంపదను దోచిపెట్టిన చంద్రబాబు.
– రాజధానిలో లక్షల కోట్ల సంపద దోచి సింగపూర్, మలేషియాలో దాచాడు.
– చంద్రబాబు ఆస్తి రెండెకరాలే. 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడంటే ఎలా సాధ్యమైంది.
– జగనన్న వచ్చిన తర్వాత మన సంపదను పిల్లలు చదువుకోడానికి ఇంగ్లీషు మీడియం, రైతు భరోసా మొదలు పేదవాడికి మేలు జరిగే ప్రతి పథకాన్నీ ఇస్తూ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు.
– జగనన్న ఇడుపులపాయకు తీసుకెళ్లి నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఎంపీల లిస్టు చదివించారు.
–  రాజ్యసభ అభ్యర్థులను చంద్రబాబు తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
– పదో తరగతి చదివిన వ్యక్తికి గ్రీన్‌ ఇంక్‌తో సంతకం చేసేలా అవకాశం ఇచ్చారు.
– రూ.371 కోట్లు దోచుకుతిని జైలుకెళ్లిన చంద్రబాబు. నిజం గెలిస్తే చంద్రబాబు శేష జీవితం అంతా జైల్లో గడపాల్సిందే. 
– సామాన్యుడు, పేద కూలీ కొడుకును తెచ్చి ఎంపీని చేసిన జగనన్న.
– విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహం తాడేపల్లివైపు చూపుతుంటుంది. నా ఆశయాలు నెరవేర్చే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని జగనన్నవైపు చూపుతుంటుంది.

 ఎమ్మల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... 

– జగనన్న సారథ్యంలో రాష్ట్రంలో సామాజిక సాధికారత, పేదవాడికి జరిగిన మేలు, ఆత్మగౌరవంతో ఎలా జీవించగలుగుతున్నారో అందరూ గమనించాలి.
– కృష్ణా జిల్లాలో రాజకీయ మీటింగ్‌ ఏర్పాటు చేస్తే ఎక్కడా బీసీలు, ఎస్సీలు డయాస్‌పై కూర్చొనేవారు కాదు.
– బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు పెద్దపీట వేసి వీళ్లూ నా సహచరులు, నా రాజకీయ వారసులు అని రాష్ట్రం నలుమూలలకు పంపుతున్న జగనన్న. 
– గతంలో ప్రభుత్వ పథకం అందాలంటే నాయకుల వద్దకు వెళ్లి అడుక్కొనే పరిస్థితి. 
– ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ పథకాలను తీసుకొచ్చి మీరు ఓటు వేయకున్నా పథకాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. 
– రాజశేఖరరెడ్డి గారు సీఎం అయిన తర్వాతే రాష్ట్రంలో పేదవాళ్లు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే పరిస్థితి వచ్చింది.
– ఇంటికో ఇంజనీరు, ఐఏఎస్‌ అయ్యే పరిస్థితి జగనన్న, రాజశేఖరరెడ్డి తెచ్చారు.
– కొన్ని వేల ఎకరాలు కొని 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగనన్న. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడూ ఇలా చేయలేదు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఇవ్వలేదు.
– దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డిగారు. పేదవాళ్ల కోసం జగనన్న మళ్లీ సీఎం అవ్వాల్సిన అవసరం ఉంది. 

 ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.... 

– సామాన్యుడైన నన్ను జగనన్న నాయకుడిగా చేశారు. పామర్రు ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీతో గెలిచాడంటే అందుకు కారణం వైయస్సార్‌సీపీ కుటుంబసభ్యులే.
– గతంలో మైనార్టీలను చులకనగా భావిస్తే, ఈరోజు జగనన్న నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని అక్కున్న చేర్చుకున్నారు.
– ఆర్థికంగా వెనుకబడిన కాపు, ఓసీలను జగనన్న ఆదుకున్నారు. కులాలు, మతాలు చూడకుండా పరిపాలిస్తున్న జగనన్న.
– ఈ నాలుగేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు డీబీటీ ద్వారా పామర్రు నియోజకవర్గానికి రూ.799 కోట్లు డైరెక్ట్‌గా ఇచ్చిన జగనన్న.
– గతంలో పెన్షన్‌రావాలంటే పెద్దమనిషి వద్దకెళ్లి నమస్కారం పెడితేనే ఇచ్చేవాళ్లు.  కానీ ఈరోజు జగనన్న కులాలు, మతాలు, రాజకీయం చూడట్లేదు. 
– గతంలో పంచాయతీ ఆఫీసుల వద్ద పడిగాపులుగాస్తే వచ్చే పింఛన్లు.. నేడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికే వస్తున్నాయి.
[

Back to Top