గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

చంద్రబాబు సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరం

అమరావతి: గతానికి భిన్నంగా ఈ సారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్ర తిరగరాసే బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుకు ప్రజా సమస్యలపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు. ఏ అంశంపైనైనా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 
 

Back to Top