విశాఖ‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుక‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ హాజరు కానున్నారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి కాసేప‌టి క్రితం బ‌య‌ల్దేరిన సీఎం.. 6 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి బీచ్‌ రోడ్డులోని పార్క్‌ హోటల్‌కు చేరుకుంటారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహ వేడుక‌లో పాల్గొని నూత‌న‌ వధూవరులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వదించనున్నారు. అనంత‌రం 6.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకోనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top