రాష్ట్రానికి ప‌ట్టిన శ‌ని, ద‌రిద్రం నువ్వే చంద్రబాబు

మాజీ మంత్రి కొడాలి నాని 

సీఎం వైయ‌స్‌ జగన్‌ డీఎన్‌ఏ రాయలసీమ

లోకేష్ ఎక్కడ పుట్టాడు..? నీ డీఎన్‌ఏ ఏంటీ ?

చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌ పండగ చేశారు

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సైకో చంద్రబాబు 

తాడేప‌ల్లి:  రాష్ట్రానికి ప‌ట్టిన అస‌లైన శ‌నిగాడివి, ద‌రిద్రానివి నువ్వే చంద్ర‌బాబూ అంటూ మాజీ మంత్రి కొడాలి నాని మండిప‌డ్డారు. నీ ఇనుప పాదం రాష్ట్రంలో లేక‌పోవ‌డం వ‌ల‌నే పుష్క‌లంగా వ‌ర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉన్నార‌ని చెప్పారు. ద‌య‌చేసి ఆంధ్రాలో ఇల్లు క‌ట్టుకుని జ‌నాన్ని రోడ్డు పాలు చేయొద్దు.. నీ శేష జీవితం హైద‌రాబాద్ లోనే ముగించు అంటూ స‌ల‌హా ఇచ్చారు.  శుక్ర‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.   లోకేష్‌ యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టిందని తీవ్ర విమర్శలు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా?. సీఎం వైయ‌స్‌ జగన్‌ డీఎన్‌ఏ రాయలసీమది.. నీ డీఎన్ఏ ఏంటి?  లోకేష్ ఎక్క‌డ పుట్టాడ‌ని మేం అంటే ఎలా ఉంటుంది?. లోకేష్‌ డీఎన్‌ఏ తెలంగాణదిని కొడాలి నాని పేర్కొన్నారు. 

 బాబు, లోకేశ్‌కు పిచ్చెక్కింది:
    హైదరాబాద్‌ ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి చిత్తూరు జిల్లా పాదయాత్రకు వచ్చిన నారా లోకేశ్‌ తన పాదయాత్రలో జనాల్లేక పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రిగారిని ఇష్టానుసారంగా నోటి కొచ్చినట్లు తూలనాడుతున్నాడు. మేం మాట్లాడితే బూతులు అంటారు. మరి, ఈరోజు ఒక పక్క  చంద్రబాబు, మరోపక్క లోకేశ్‌ మాట్లాడే మాటలేంటి..? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిపై నోరు పారేసుకోవడం సబబేనా..? అసలు సీఎంను విమర్శించే అర్హత బాబుకు, లోకేశ్‌కు ఎవరిచ్చారు..? తెలంగాణలో ఉంటూ అక్కడ రాజకీయాలు చేసుకోవాల్సిన వాళ్లు ఇక్కడకొచ్చి మాట్లాడేందుకు ఆ ఇద్దరికీ సిగ్గుండాలి కదా..? 
    నారా లోకేశ్‌ పాదయాత్ర ఎక్కడా జనాలు లేక, ఏ మాత్రం స్పందన కనిపించక, ఒక జోకర్‌ ఊరేగింపుగా సాగుతుండగా, ఆ బచ్చాగాడు బపూన్‌ కోతలు కోస్తున్నాడు.

మరో గిరి చూసుకో లోకేశ్‌..:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ బిడ్డగా అజేయుడైన నాయకుడిగా ఎదిగారు. ఆయన రాయలసీమ బిడ్డ కాబట్టే.. సోనియాగాంధీని ఎదిరించి స్వయంకృషితో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. మరి, లోకేశ్‌ ఎక్కడ పుట్టాడని అడిగితే తండ్రీకొడుకులు ఏడుపులు పెడబొబ్బలు పెట్టారు. జగన్‌ గారి డీఎన్‌ఏ రాయలసీమ. ఆయన కడప జిల్లాలో పుట్టాడు.  నువ్వు పుట్టింది.. పెరిగింది తెలంగాణ. నీ డీఎన్‌ఏ తెలంగాణ. అక్కడ పుట్టినోడివి ఇక్కడకొచ్చి పాదయాత్ర చేస్తున్నావు. మంగళగిరి కాకుండా తెలంగాణలో ఏదో ఒక గిరిని చూసుకో లోకేశ్‌.. 

కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబే:
    పుట్టుకతోనే దరిద్రుడు చంద్రబాబు. భారతంలో ఆనాడే చెప్పారు.
ఆనాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు నిండి జలకళతో కనిపించాయి. అదే విధంగా ఇప్పుడు ఆయన తనయుడు శ్రీ వైయస్‌ జగన్, సీఎంగా ఉన్న సమయంలో కూడా అదే పరిస్థితి చూస్తున్నాం. అదే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా ఒక్క ప్రాజెక్టు నిండిందా..? వర్షాలు కురవక నదులు ఎండిపోయి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కరువును చూసిన సంగతి అందరికీ తెలిసిందే.

అందుకే బాబుకు సన్యాసం ఇచ్చారు:
    బాబు పాలనలో గోదావరి నీళ్లు మోటార్లు పెట్టి కృష్ణా నదికి.. అక్కడ్నుంచి మరొక నదికి పెట్టుకునే పరిస్థితిని చూశారు. అసలు, ఈ రాష్ట్రానికి పట్టిన నిత్య దరిద్రమే చంద్రబాబునాయుడు. రాజ్య పాలకుడి జాతకం ప్రకారమే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందా?. కరవుతో ఎండి పోయినట్లు ఉంటుందా? అన్నట్లు నడుస్తుంది. ప్రజలను ఇక్కట్లకు గురి చేసి అధికార దాహమే పరమావధిగా పాలన చేసిన చంద్రబాబే కరువుకు అంబాసిడర్‌గా చెప్పుకోవచ్చు. అందుకే ప్రజలు బాబుకు రాజకీయ సన్యాసం ఇచ్చారు.

వెన్నుపోటుకు పేటెంట్‌ చంద్రబాబే:
    రెండెకరాల రైతుగా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు ఈరోజు లక్షల కోట్లకు ఎలా పడగలెత్తాడు? అదేమంటే, ఇంత ఆస్తి నీకెలా వచ్చిందయ్యా అంటే.. ‘నాకు ఎన్టీఆర్‌ ఆస్తి ఇచ్చి వెళ్లాడు’ అంటాడు. ఇదెంత హాస్యాస్పదం. చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఆనాడే ఒక కీలకమైన మాట అన్నాడు. ‘ఈ బాబు అనే వాడు వెన్నుపోటు అవినీతి చక్రవర్తి’ అని ఎన్టీఆర్‌ చెప్పిన మాటల్ని ప్రజలు ఇప్పటికీ వింటున్నారు. ఎన్టీ రామారావు సంపాదించిన ఆస్తి మొత్తం తనకే ఇచ్చాడని చెప్పుకోవడానికి చంద్రబాబుకు సిగ్గే లేదు. 
    ఎన్టీఆర్‌ తన సంతానానికి కాకుండా ఈ నిత్య దరిద్ర ఫోర్‌ ట్వంటీ అవినీతి చక్రవర్తి చంద్రబాబుకు తన ఆస్తి ఇచ్చిపోతాడా..? నోరుతెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే చంద్రబాబుకు వెన్నుపోటు పేటెంట్‌ ఇవ్వొచ్చు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును హెరిటేజ్‌కు బదలాయించి వైట్‌ చేసుకోవడంలో చంద్రబాబు అవినీతి చక్రవర్తిగా ఎదిగాడు. 

రైతులనూ మోసం చేసిన ఫోర్‌ ట్వంటీ:
    రాష్ట్రంలో పేదల్ని సర్వనాశనం చేసిన ఫోర్‌ట్వంటీ నాయకుడు చంద్రబాబు. రైతులకు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని కేవలం రూ.7200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న నీచమైన వ్యక్తి అతడు. వ్యవసాయం మీద ఇప్పటి వరకు చంద్రబాబు మనసులో మాట రాయలేదంట. సాక్షి మీడియా పని గట్టుకుని మరీ చంద్రబాబు మాటల్ని వక్రీకరించిందంట.
ఇందులో నిజనిజాలు చూస్తే..
1997లోనే ‘వ్యవసాయం దండగ’ అన్న పుస్తకాన్ని చంద్రబాబు రాస్తే.. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తన పాలనలో వ్యవసాయం పండగ అని నిరూపించారు. ఇక, సాక్షి మీడియా 2007–08లో వచ్చింది. మరి, చంద్రబాబు 1997లోనే వ్యవసాయం దండగ అనే మాటను సాక్షి మీడియా వక్రీకరించిందని చెప్పుకోవడం సిగ్గుచేటు.
    ఎవరైనా దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా..? అని బాబు నోటితో అన్నారు. అలాగే కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే ఆడపిల్ల కావాలని ఎవరైనా అడుగుతారా..? అనే మాట కూడా బాబే అన్న సంగతి జనాలకు తెలుసు.

నువ్వు ఒకటంటే.. మేం రెండంటాం..:
    ముసలి వయసులో అల్జీమర్స్‌తో పిచ్చి పట్టినట్లు చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. మా గౌరవ సీఎంగారిని నోటికొచ్చినట్లు తిడితే.. బాబు ఒకటంటే.. మేం ఆయన్ను రెండంటాం.
    ‘సైకో ఎవడ్రా.. నీకన్నీ పెద్ద సైకో ఉంటాడా చంద్రబాబూ.. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి.. ఆయన పార్టీని లాక్కుని.. ఆయన ట్రస్టుల్ని కాజేసి.. ఆయన డబ్బును దోచేసి.. వథ్థాప్యంలో ఉన్న ఎన్టీఆర్‌ను మానసికంగా వేధించి చంపేసిన నువ్వు అసలైన పెద్ద సైకోవి.. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో చంపి మళ్లీ ఆయన విగ్రహాలకు దండలేసి నీతికబుర్లు చెబుతావు.’

ఆ కుటుంబంలోనే పిచ్చి ఉంది:
    చంద్రబాబు కుటుంబంలోనే పిచ్చి ఉంది. బాబు తండ్రి కర్జూరనాయుడుకి ఆఖరు సమయంలో మైండ్‌ పని చేయక పిచ్కెక్కితే గదిలో పడేసి ఉంచారు. అంతే కాకుండా.. బాబు సొంత తమ్ముడు రామ్మూర్తినాయుడుని ఇప్పటికీ చేతులకు సంకెళ్లు వేసి గదిలోనే ఉంచాడు కదా.. 

బుర్ర చెడగొట్టే బాబు ప్రసంగాలు:
    ‘ఏం తమ్ముళ్లూ.. సెల్‌ఫోన్లు నేనే కనిపెట్టా కదా..’ అని ఈ చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతాడు. ఎన్టీఆర్‌ మీదనో.. లేదంటే, పార్టీ మీద అభిమానం ఉన్నోళ్లందర్నీ చివరికి మెంటల్‌ ఆస్పత్రుల పాల్జేయడానికి చంద్రబాబు వెనుకాడడు. అయ్యన్నపాత్రుడు లాంటి మెంటల్‌ నాయకులు టీడీపీలో ఇంకా మాట్లాడుతున్నారంటే.. అది కేవలం చంద్రబాబు బుర్ర చెడగొట్టే ప్రసంగాల వల్లనే అని చెప్పాలి.
    ‘అయ్యన్నపాత్రుడూ.. నీ పార్టీ అధినేత చంద్రబాబు, పప్పు లోకేశ్‌ ఎక్కడ్నుంచి ఆంధ్రకు వచ్చారు..? హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రి నుంచే కదా.. నాలుగు రోజులు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించి పిచ్చిపిచ్చిగా మాట్లాడి హైదరాబాద్‌కు వెళ్లగానే భువనేశ్వరి ఈ తండ్రీ కొడుకుల్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి మందులిప్పించి పంపుతుంది..’ 

వివేకానందరెడ్డిని బాబే చంపాడేమో..:
    చంద్రబాబు పరిపాలనలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అందుకేనేమో.. సామర్లకోట బహిరంగ సభలో ‘ఏం తమ్ముళ్లూ.. వివేకాను నేనే హత్య చేశాను.. ఏమంటారు ..? ’ అని స్వయంగా చంద్రబాబు అన్నారు. అదే విషయాన్ని మీడియా క్లిపింగ్‌ చూపితే.. అది సాక్షి మీడియా తయారు చేసిన ఎడిటింగ్‌ క్లిప్‌ అంటున్నాడు బాబు. ఏమో.. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వివేకా హత్యకు అతనే కారణమై ఉంటాడేమో.. ఆరోజు ఇంటెలీజెన్స్‌ ఛీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు చంద్రబాబు, లోకేశ్‌ను సీబీఐ విచారణకు పిలిచి వారి శైలిలో వ్యవహరిస్తే ఖచ్చితంగా నిజాలు వెలుగులోకి వస్తాయి. 
    ఇప్పటికైనా చంద్రబాబు, లోకేశ్‌లు వివేకాహత్యపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అలా కాదంటే, భవిష్యత్తులో ఈ కేసులో బాబు ప్రమేయం కూడా విచారణలో తేల్చాల్సి ఉంది. శ్రీ జగన్‌గారిపై ఇక నుంచి ఏ ఒక్కరూ నోరు పారేసుకున్నా గుడ్డలూడదీసి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి. 

కాపీయింగ్‌ పొలిటీషియన్‌ బాబు:
    చంద్రబాబు బతుకంతా రాజకీయాల్లో ఉన్న ఇతరుల విధానాలు, నిర్ణయాలను కాపీ చేయడంతో నడుస్తుంది. దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలన అనగానే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి. జగన్‌మోహన్‌రెడ్డిగారి పాలన చెప్పుకోవాలంటే.. నవరత్నాలు వంటి సంక్షేమ పథకాల గురించి రాష్ట్రంలో అందరూ చెబుతారు. 
    అదే 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబునాయుడు పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క పథకమైనా ఉందా? అంటే.. లేదనే మాటే మెజార్టీగా వినిపిస్తుంది. కాబట్టే.. చంద్రబాబు పర్యటనల్లో ఊకదంపుడు ప్రసంగాలతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. తాజాగా, తామూ గృహ సారథుల్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాడు.
    మరి ఈ విధానం మా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కాపీ కొట్టింది కాదా..? బాబు రాజకీయ జీవితమంతా ఎవరో ఒకరిని అనుసరించడమే పనిగా నడుస్తున్న రాజకీయంగా చెప్పాలి. అతనికంటూ నీతి నియమాలు, విలువలంటూ ఉండవు. నిన్నటిదాకా పేదలకు పప్పుబెల్లాల్లా సంక్షేమ పథకాల్ని పంచుతున్నాడని విమర్శించిన బాబు.. నేడేమో జగన్‌మోహన్‌రెడ్డి గారు అమలు చేస్తున్న నవరత్నాలను కొనసాగిస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితికి దిగజారాడు. 

ఆ చిత్తకార్తె కుక్కలెవరు..?
    ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో జనసేన అధినేత వవన్‌కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై మాట్లాడిన వాళ్లంతా ఊరకుక్కలంటూ చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అన్నాడు. మరి, ఎన్టీఆర్‌ రెండో పెళ్లి గురించి మాట్లాడి.. దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి వెన్నుపోటు పొడిచిన చిత్తకార్తె కుక్కులెవరు..? దీనిపై బాలకృష్ణ, చంద్రబాబు సమాధానం చెప్పాలి కదా.. రామోజీరావు, రాధాకృష్ణలు కూడా ఆనాడు ఎన్టీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన చిత్తకార్తె కుక్కులే కదా?.
    చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్‌ అధికారాన్ని చూసి ఆయన పంచన చేరి.. పిల్లనిచ్చిన పాపానికి ఆయన్నే Ðð న్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్‌ ఆస్తుల్ని, ట్రస్టుల్ని, రాజకీయ పార్టీని, జెండాను అన్నీ లాగేసుకున్న మాట నిజం కాదా..? దీనిపై చంద్రబాబుకు వత్తాసు పలికే రాజకీయ విశ్లేషకులు కూడా డిబేట్లలో మాట్లాడొచ్చు కదా.. అని కొడాలి నాని అన్నారు.

Back to Top