‘పులివెందుల ఫోబియా’ తండ్రీ, కొడుకులకు పట్టుకుంది

అమరావతి : ‘వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ‘పులివెందుల ఫోబియా’  తండ్రీ, కొడుకులకు పట్టుకుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తక్షణం నోటిఫై చేయాలన్నారు.  లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు!’ అని వ్యాఖ్యానించారు. 

‘ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ? ఒక వైపు అమరావతి నుంచి రాజధాని తరలించ వద్దని ఉత్తుత్తి ఉద్యమాలు నడిపిస్తావు. మళ్లీ ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తావు. వారి ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటే ఇలాంటి శాస్తే జరుగుతుంది’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

‘ప్రజలు ఉమ్మేస్తారన్న సిగ్గు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు చంద్రబాబూ. నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సిఎం వైయస్‌ జగన్ గారు నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ బస్సు యాత్రకు బయలుదేరతావా? అమరావతి కోసం ఉత్తరాంధ్ర  ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కుంటావా?’ అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌ చేశారు.

Back to Top