అమరావతి: సోలార్, విండ్ పవర్‌ల కారణంగా ఏటా రూ. 5 వేల కోట్ల భారం పడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి లేఖ రాశారు. ‘సోలార్, విండ్ పవర్‌ల కోసం యూనిట్‌కు రూ. 3.55 భారం పడుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే అందులో 15 వేల మిలియన్ యూనిట్లు సోలార్, విండ్ పవర్‌లదే. మరోవైపు కొనుగోలు రూపంలో ప్రతి సోలార్, విండ్ పవర్ యూనిట్‌కు రూ. 4.84 కన్నా ఎక్కువ చెల్లిస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా నిర్ణయించిన పరిమితికి మించి సోలార్, విండ్ పవర్‌ను కొనుగోలు చేశారు. దీనివల్ల జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి సోలార్, విండ్ పవర్‌ల కోసం అధిక భారాన్ని మోస్తున్నాం. సోలార్, విండ్ పవర్ ప్రమోషన్‌లో భాగంగా కేంద్రం సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుంది’ అని మంత్రి బాలినేని లేఖలో పేర్కొన్నారు.