చేనేత పరిశ్రమ మన దేశ సంస్కృతికి ప్రతిబింబం

సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌
 

అమరావతి: చేనేత పరిశ్రమ మన దేశ సంస్కృతికి ప్రతి బింబమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొనియాడారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు సీఎం వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చేనేత పరిశ్రమ మన దేశ సంస్కృతికి ప్రతిబింబమని, స్వదేశీ ఉద్యమం ద్వారా జాతిని ఏకం చేసిన చరిత్ర చేనేతలదన్నారు. చేనేతల అభ్యున్నతికి చిత్తశుద్ధితో ఉన్నామని, రాష్ట్ర బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని సీఎం వివరించారు.
 

Back to Top