ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్షలు  

 అమరావతి: పీఎస్‌ఎల్‌వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

పీఎస్‌ఎల్‌వీ-సీ53 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్‌ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top