తాడేపల్లి: పవన్ కళ్యాణ్ చేసేది రాజకీయమా..? రౌడీయిజమా..? అని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాజకీయమంటే సినిమా అనుకున్నావా..? జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లాక్కొని ముద్దాడిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్టీఆర్ టీడీపీని పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనిని తనదిగా చెప్పుకునే దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేవారు తమ పార్టీలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. చంద్రబాబులా తమది ఎవరి దగ్గర నుంచి లాక్కున్న పార్టీ కాదని, వైఎస్ జగన్ తన రెక్కల కష్టంతో నిర్మించుకున్న పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. పవన్ స్పీచ్ అంతా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టేనని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోను దాచేసిన ఘనత చంద్రబాబుదేనని మంండిపడ్డారు. బాబు తన ఐదేళ్ల పాలనలో 45 ఆలయాలను కూల్చేశారని, ప్రతి గ్రామంలో బెల్ట్‌షాప్‌లు పెట్టి మందు అమ్మించారని విమర్శించారు. బాబు హయాంలో గంజాయి సాగులో ఏపీని నెంబర్ వన్ చేశారని దుయ్యబట్టారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. బాబు, పవన్‌వి ఒకే స్పిరిట్ విమర్శలుః గత నాలుగురోజులుగా వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ మీద, జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద విచ్చలవిడిగా ఎప్పటిలాగానే ఆందోళనతో, ఆవేశంతో, అసహనంతో పవన్‌కళ్యాణ్ అనరాని మాటలు మాట్లాడారు. మరోవైపు ఆయన పోయిన చెప్పులు వెతుక్కుంటూ ఊరూరూ తిరుగుతున్నారు. కాకినాడకు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని, వైఎస్‌ఆర్‌సీపీ దూషించడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని పట్టుకుని అవాకులు చెవాకులు పేలాడు. ఏంటబ్బా పవన్‌కళ్యాణ్ ఇంత స్పిరిట్‌తో మాట్లాడుతున్నాడేంటని చూస్తే.. ఈరోజు చంద్రబాబు మాట్లాడిన మాటలతీరును పరిశీలిస్తే.. ఈ ఇద్దరూ ఒకరికొకరు స్పిరిట్‌ను పంచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎంత దురదృష్టమంటే, ఈ ఇద్దరిలో సతీసావిత్రీలాగా ఒకయాన, హరిశ్చంద్రునిలా మరొకాయన కలిసి ధర్మమంతా వారినే ఆవహించినట్లు.. వారు చెప్పేవన్నీ సత్యాలైనట్లు నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బాబు, పవన్ పొత్తు పరిపాలనలో ఘోరాలేః మరి, ఈ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలన చేశారు గదా.. మీ పరిపాలన హయాంలో విజయవాడలో 45 దేవాలయాలు కూల్చిపడేశారు. ఈ విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెబుతున్నాను. ప్రతీ మారుమూల గ్రామాల్లో బెల్టుషాపులు పెట్టి వ్యాపారం చేసి మద్యాన్ని ఏరుల్లా ప్రవహింపజేశారు. అదేవిధంగా గంజాయి సాగులో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ చేశారు. ఇది నేనంటున్న మాటకాదు. స్వయంగా టీడీపీలో ఉన్న ఘంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులే అన్నారు. వారి కాకమ్మ కబుర్లు ఎవరూ నమ్మరుః ఇవన్నీ మరిచిపోయి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు కాకమ్మ కబుర్లు చెబుతున్నారా..? మీ మాటల్ని ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా..? ఎట్టిపరిస్థితుల్లో నమ్మరు గాక నమ్మరని స్పష్టంచేస్తున్నాను. ఇక, అవినీతి విషయానికొస్తే ఏపీ అప్పట్లో దేశంలోనే నెంబర్ ఒన్ స్థానానికి నెట్టబడింది. చంద్రబాబు హయాంలో వీరిద్దరూ కలిసే ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా విడుదల చేశారు. అందులో ఏ ఒక్క హామీని అమలు చేయకుండానే ఆ మ్యానిఫెస్టోను భూస్థాపితం చేశారు. ఇంత చేసికూడా ఇవాళ వాళ్లేదో అద్భుతాలు సాధించినట్లు చెబుతున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడుతున్న పనికిమాలినోడు బాబేః ఈరోజు చంద్రబాబు ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు. గుడివాడలో టిడ్కో ఇళ్లు ఆయన కడితే మా జగన్‌గారు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారంట. మరి, ఆయన టిడ్కో ఇళ్లు ఎప్పుడు కట్టాడో..? ఏ దశకు కట్టాడో.. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత జగన్ గారు ఇచ్చిన తర్వాత బాబు ఒక చిత్రమైన పోలికతో మాట్లాడాడు. ఎవరికో పుట్టిన బిడ్డ తనకు పుట్టిన బిడ్డగా చెప్పుకుంటున్నారని బాబు వెటకారమాడాడు. మరి, ఈ సందర్భంలో నేను కొన్ని నిజాల్ని మాట్లాడితే, ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడుతూ తిరిగేది ఎవరు బాబూ..? అని నేను గుర్తుచేస్తే మళ్లీ మీకు బాధ. ఇదే బాబు గుక్కపట్టి ఏడుస్తాడు. కోప్పడతాడు. నటిస్తాడు. అసలు, ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్న పనికిమాలిన వాడు ఈ చంద్రబాబు అని అంటున్నాను. నేను ఖచ్చితంగా ఈ మాట మీద నిలబడుతున్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు..? ఎన్టీ రామారావు గారు అయితే, ఆయన పార్టీ పెట్టినప్పుడు బాబు ఎక్కడున్నాడు..? కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్టీఆర్ గారి ఉద్భవించిన పార్టీని ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలికి.. మరలా తెలుగుదేశం పార్టీ గూటికి చేరావు. ఆ తర్వాత ఎన్టీరామారావునే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని నువ్వే పుట్టించినట్లు ఎత్తుకుని ముద్దాడుతున్న పనికిమాలిన వాడివి నువ్వే కదా చంద్రబాబు..? అని గుర్తుచేస్తున్నాను. పోలవరంనూ తన బిడ్డేనంటున్న బుద్ధిలేనోడూ బాబుః పోలవరం కూడా తన బిడ్డగా చెప్పుకుంటున్నాడు ఈ చంద్రబాబు. ఆయన బిడ్డ ఎలా అవుతుంది..? మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి కలల పంట పోలవరం అని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రూ.4వేల కోట్లు ఖర్చుపెడితే.. అలాంటి పోలవరంను నా బిడ్డ అని చెప్పుకోవడానికి బాబుకు బుద్ధి సిగ్గుందా..? అని అడుగుతున్నాను. దీన్నిబట్టి ఈ దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డే అని చెప్పుకునే దుర్మార్గుడు, బుద్ధిలేనివాడు ఎవరయ్యా అంటే, అది నారా చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాను. కాదని చెప్పే దమ్ముందా చంద్రబాబు ..? అని అడుగుతున్నాను. కరకట్ట ప్రకాష్‌రాజ్ ఎవరోకాదు.. చంద్రబాబేః చంద్రబాబు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని కరకట్ట కమల్‌హాసన్‌గా పోల్చుతున్నాడు. తాడేపల్లి కరకట్ట మీద తేరగా ఎవరిదో స్థలాన్ని ఆక్రమించుకుని నివాసం ఉంటున్న బుద్ధిలేని కరకట్ట ప్రకాష్‌రాజ్ ఎవరు..? అంటే, చిన్నపిల్లోడుతో సహా నారా చంద్రబాబు అనే చెబుతారు. ఇక్కడ మళ్లీ నటుడు ప్రకాష్‌రాజ్ గారికి కోపం వస్తుందేమో.. అయ్యా ప్రకాష్‌రాజ్ గారూ.. మీరు చాలా అద్భుతమైన నటులు. కానీ, మీరు వేసిన పాత్రలన్నీ ఇక్కడి మా చంద్రబాబువే. దయచేసి ప్రకాష్‌రాజ్ అపార్ధం చేసుకోవద్దని ఈ సందర్భంగా వివరణ ఇస్తున్నాను. 2024లోనూ కౌరవవధతో మళ్లీ సీఎం జగన్‌గారేః రేపు జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం.. కౌరవ వధ జరగాలని చంద్రబాబు కొత్తగా పలుకుతున్నాడు. అయ్యా బాబూ.. ఇప్పటికే ఒకసారి కౌరవ వధ జరిగింది కదా..? ఒకసారేమో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి చేతిలో జరిగింది. మరొకసారేమో.. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి చేతుల్లో జరిగింది. రేపు 2024 ఎన్నికల్లో కూడా ఇంకోసారి కౌరవ వధ జరిగి జగన్ గారు అనూహ్యమైన మెజార్టీతో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టబోతున్నారని ధీమాగా చెబుతున్నాను. జగన్‌గారి రెక్కలకష్టం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీః ఇవన్నీ చంద్రబాబుకు గుర్తుకొచ్చి భయపడి వణికిపోతూ ఏవేవో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. తన దత్తపుత్రుడి చేత మాట్లాడిస్తున్నాడు. మీలాంటి ఉడత వూపులకు బెదిరే పార్టీ మాదికాదు.. మాది దమ్మున్న ధీశాలి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు నాయకత్వం వహిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెబుతున్నాను. మాపార్టీ ఎవరి దగ్గరనో కాజేసిన పార్టీ కాదు. జగన్‌మోహన్‌రెడ్డి గారి రెక్కల కష్టంతో ఓదార్పుయాత్ర చేపట్టి.. పాదయాత్రతో రాయిరాయి పెట్టుకుంటూ బిల్డప్ చేసిన పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేస్తున్నాను. శ్రీవాణి ట్రస్టులో పైసా కూడా అవినీతిలేదుః శ్రీవాణి ట్రస్టు గురించి అందులో అవినీతి జరుగుతుందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఇద్దరూ మాట్లాడుతున్నారు. అసలు, ఆ ట్రస్టు గురించి వారిద్దరికీ తెలుసా..? వైఎస్‌ఆర్ హయాంలో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టులో ఒక్క పైసా కూడా అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. కావాలంటే, ఎవరైనా చెక్ చేసుకోవచ్చని మనవిచేసుకుంటున్నాను. రాష్ట్రంలోని దేవాలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు నిధుల్ని వెచ్చిస్తారు. గతంలో తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలంటే కొండమీద దళారులకు వేలకు వేలు చెల్లించి దర్శించుకునే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితికి చెక్ పెట్టి శ్రీవారికే ఆ డబ్బు చెందాలని ఏర్పాటు చేసిందే శ్రీవాణి ట్రస్టు. అటువంటి ట్రస్టును అందరూ మెచ్చుకుంటుంటే, రాష్ట్రంలోని ఎన్నో ఆలయాల్ని పునురుద్ధరిస్తుంటే.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కి కన్ను కుట్టి వాటిమీద మేం డబ్బులు కాజేశామని మాట్లాడే దౌర్భాగ్య దుస్థితికి ఎందుకు వెళ్లారో వాళ్లకే తెలియాలి. పవన్‌కు పుట్టగతులుండవ్..ః దశావతారాల్లో ఒకరైన వారాహీ అమ్మవారి పేరు పెట్టుకుని ఆ వాహనం ఎక్కి చంద్రబాబు చెప్పిన అబద్ధమల్లా మాట్లాడి మా జగన్ గారిని, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా దూషిస్తున్న పవన్‌కళ్యాణ్‌కు పుట్టగతులుండవ్ అని హెచ్చరిస్తున్నాను. అమ్మవారి ఆగ్రహానికి పవన్‌కళ్యాణ్ తప్పకుండా గురవుతాడని చెబుతున్నాను. 2019 ఎన్నికల్లో నిలబడిన రెండుచోట్లా ఓడిపోయిన పపన్‌కళ్యాణŠ కు.. రేపొచ్చే ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదు. అంతేగాకుండా, అమ్మవారి వాహనంపై డాన్సులేస్తూ పిచ్చి ప్రేలాపనాలతో ప్రవర్తిస్తున్న అతనికి సినిమాల్లో కూడా వాతావరణం వికటిస్తుందని.. అమ్మవారి శాపం మూలానా పవన్ సినిమాలు సైతం హిట్టుకాకుండా ప్లాప్‌స్టార్‌గా మిగులుతాడని చెబుతున్నాను. వవన్‌కళ్యాణ్‌కు బట్టలూడదీసే రోజులొస్తాయేమో..?ః నీ చెప్పులు పోయినంతమాత్రానా రాష్ట్రమంతా తిరిగి వెతుక్కోవాల్సింది పోయి నిన్న కాకినాడకు వెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్‌ను విమర్శిస్తావా..? అక్కడ రెండుమార్లు పోటీ చేసి గెలిచిన ద్వారంపూడిని విమర్శించేంత మొనగాడా పవన్‌కళ్యాణ్..? అధికారంలోకొస్తే మా నాయకుల్ని బట్టలూడదీసి కొడతావా.. పవన్..? ఎటూ నీ పార్టీ అధికారంలోకి వచ్చేదేమీలేదు గానీ.. అసలు, నీకు బట్టలూసి కొట్టే దమ్మూధైర్యముందా..? అని అడుగుతున్నాను. అసలు, ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమవుతుందా..? ఏం మాట్లాడుతున్నావు. సిగ్గుమాలి ఇంత దిగజారి మాట్లాడతావా..? మరి, నీలా మాట్లాడాలంటే మాకు సభ్యత, సంస్కారం ఉంది కనుక మేమేం మాట్లాడం. ఇలాగే వాగుతూ నీ వంటిమీద ఉన్న బట్టలు కూడా ఎవడో ఒకడు ఊడదీసుకు పోతాడు.. నువ్వేమో చెడ్డీ, బనియన్‌తో ప్రసంగిస్తూ నా బట్టలెవరో ఊడదీసుకుపోయారంటూ తిరగడం ఖాయం. పవన్ చేసేది రాజకీయమా..? రౌడీయిజమా..?ః ఆవేశంతో, ఆక్రోశంతో దిగజారి మాట్లాడుతున్న ఈ పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడు అని మరోమారు నేను ఖరాకండీగా చెబుతూ గుర్తుచేస్తున్నాను. ఏవేవో పిచ్చిపిచ్చి మాటలు.. వైసీపీ గూండాలంటాడు. మేం గూండాలం కాదు. అది నెంబర్ ఒన్ పవన్ గుర్తించాలి. మా ఇళ్లల్లోకి వచ్చి బయటకు లాగి మరీ కొడతాడంట. ఆయన బయటకు లాగి కొడుతుంటే మేం చేతులు కట్టుకుని కూర్చొవాల్నా..? అసలు, ఈ వ్యక్తి రౌడీయిజనం చేస్తున్నాడా..? రాజకీయం చేస్తున్నాడా..? ఇంత తిక్కలోడు రాజకీయాల్లో ఉంటాడా..? అని గుర్తుచేస్తున్నాను. పవన్ అనే పిచ్చోడికి ప్రాణహాని ఉంటే నిరూపించుః ఆ మధ్యన నాకు ప్రాణహాని ఉంది. నా ఇంటిముందు రెక్కీ నిర్వహించారు. రూ.200 కోట్లు డీల్ నడిచిందని పవన్‌కళ్యాణ్ చెప్పాడు. ఆయన ఇంటికి దగ్గర్లో ఉన్న బార్ నుంచి బయటకొచ్చే మందుబాబుల్ని చూసి ఈయన భయపడి తనకు ప్రాణహాని ఉందని కథ అల్లాడు గుర్తుందా..? మళ్లీ ఈరోజు తనకు ప్రాణహాని ఉందని పవన్‌కళ్యాణ్ చెబుతున్నాడు. ఎవరి వల్ల ప్రాణహాని ఉందయ్యా..నీవల్ల ఎవరికి నష్టం. ఎవరికి లాభం..? నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజీస్టార్ బిరుదు తెచ్చుకున్నావు. ఈరోజేమో బూతుల స్టార్‌వి అయ్యావు. నిన్ను ఎలిమినేట్ చేయడానికి ఎవరికి అవసరముందో మాకైతే అర్ధంకావట్లేదు. ఈరోజు పవన్‌కళ్యాణ్ అనే పిచ్చోడు తనకు ప్రాణహాని ఉందని చెబుతుంటే.. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, విశ్లేషకులు, అభిమానులు, ప్రజలంతా కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకోవాలని మనవిచేస్తున్నాను. నిజంగా, ఆయనకు ప్రాణహాని ఉంటే ఆధారాలతో సహా నిరూపించాలి. లేదంటే, అక్కడా ఇక్కడా నాకు ప్రాణహాని ఉందంటూ సానుభూతి పొందే దిగజారుడు ఎత్తుగడల్ని మానుకోవాలని చెబుతున్నాను. పోలీసుల దర్యాప్తుతో నిజనిజాల్ని బయటపెట్టాలిః ప్రాణహాని ఉందని పవన్‌కళ్యాణ్ ప్రజల్లో సానుభూతి పొందడానికి మభ్యపెట్టే ప్రయత్నాల్ని మానుకోవాలి. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. పోలీసులకు కూడా ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మనవిచేస్తున్నాను. నిజంగా, వపన్‌కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందో లేదో అనే విషయంపై అతని దగ్గర ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టి.. తప్పుడు ప్రచారాలపై కూడా తగిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని మనవిచేస్తున్నాను. రష్యాలో పవన్ పై ఓ ఫైల్ ఓపెన్ అయ్యిందిః ఈ రాష్ట్రంలో అమ్మాయిలు మాయమవుతున్నారని.. గంజాయి మత్తులో విచ్చలవిడి దురాగతాలు జరుగుతున్నాయని.. ఢిల్లీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైల్ ఓపెన్ అయ్యిందని నిన్న పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. బాబూ పవన్.. ఢిల్లీ ఫైల్ సంగతి నాకు తెలీదుగానీ.. పవన్ కళ్యాణ్ మీద రష్యాలో మాత్రం ఒక ఫైల్ ఓపెన్ అయ్యిందని గుర్తుచేస్తున్నాను. ముందు దాని సంగతి చూసుకో.. అక్కడ కమ్యూనిస్టుల పరిపాలన సాగుతుంది కాబట్టి, ఆ ఫైల్ విషయంలో నువ్వు మోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకున్నా నిన్నెవరూ కాపాడలేరని మనవిచేస్తున్నాను. నువ్వేదో మమ్మల్ని, మా నాయకుల్ని ఢిల్లీ పేరుచెప్పి భయపెట్టాలనుకుంటే.. ఇక్కడ భయపడేవారెవ్వరూ లేరని.. మేం జగన్‌మోహన్‌రెడ్డి గారి బలమైన నాయకత్వంలో ఉన్నవారమని మరోమారు గుర్తుచేస్తున్నాను. పార్టీ నడిపే సత్తాలేని పిరికిపంద పవన్‌కళ్యాణ్ః 2009లో రాజకీయాల్లో ఉంటే జగన్ గారిని ముఖ్యమంత్రి కానిచ్చేవాడ్ని కాదని పవన్‌కళ్యాణ్ కొత్త చిలుకపలుకు ఒకటి పలికాడు. మరి, 2009లో ఆయన రాజకీయాల్లో లేడా..? అప్పట్లో ప్రజారాజ్యంలో యువరాజ్యాధిపతిగా ఉన్నాడు కదా..? మరి, ఆ సంగతి మరిచిపోయి ఇంత విడ్డూరంగా మాట్లాడటమేంటి..? పవన్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉండి పవన్ ఏం సాధించినట్టు..? నువ్వేమైనా ఒంటరిగా పోటిచేసి కాస్తాకూస్తో సీట్లు గెలుస్తావా అంటే, లేదు.. నేను చంద్రబాబును గెలిపించడానికే పుట్టానంటావు. అసలు, ఈ పవన్‌కళ్యాణ్ గురించి మాట్లాడే పరిస్థితి మాదికాదు. కాకుంటే, ఆయన ఆవేశానికి ఆక్రోసానికి పిచ్చికి ఎవరైనా అమాయకులు ప్రభావితమవుతారనే ఆందోళనతో మాట్లాడాల్సి వస్తుంది. పవన్‌కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడపగల సత్తా సామర్యం లేని పిరికిపంద అని తెలియజేస్తున్నాను. క్లారిటీలేని పార్టీ జనసేనః ఒక రాజకీయ పార్టీ విధానం లేకుండా.. సొంత ఆలోచనలేని విధంగా ఆపార్టీ అధినేత పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటే.. ఆయన పిచ్చికి అభిమానులు బలవ్వాల్సిందేనా..? అని పవన్‌కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు అధికారం కోసం నువ్వు అహరహం శ్రమిస్తూ నిన్ను నమ్ముకుని నీ చుట్టూ తిరుగుతున్న యువతను చెడగొట్టడం మంచిదికాదని పవన్‌కు హితవు పలుకుతున్నాను.ఆయన వెంట తిరిగే జనసైన్యానికి, వీరమహిళలు, కార్యకర్తలకు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. జనసేన అనేది క్లారిటీలేని పార్టీ. అది సింగిల్‌గా పోటీచేస్తుందో.. పొత్తులతో పోతుందో తెలియని పార్టీ. మీరు చంద్రబాబును గద్దెనెక్కించేందుకు వవన్‌కళ్యాణ్‌ను చూసి పనిచేయాల్సిన అవసరంలేదు. పవన్‌కళ్యాణ్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని అందరికీ విన్నవించుకుంటున్నాను. మార్గదర్శిపై జీవీఎల్ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి ః అంబటి మార్గదర్శి సంస్థపై పనిగట్టుకుని మా ప్రభుత్వం దాడులు చేయాల్సిన అవసరమేంటి..? ఇది కక్షసాధింపు అన్న బీజేపీ నేత జీవిఎల్ నరసింహారావు వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. చిట్‌ఫండ్ సంస్థల పేరిట ప్రజల డబ్బును అక్రమ మార్గాల్లో దోచుకుంటుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా.. జీవీఎల్..? మీకు అవసరమనుకుంటే రామోజీరావు కాళ్లు పట్టుకోండి.. ఆయనకు సాష్టాంగపడండి గానీ చట్టపరమైన వ్యవహారం మార్గదర్శి అక్రమాల కేసు అని మరిచిపోకండి. న్యాయస్థానాల్లో ఉన్న ఈ కేసు దర్యాప్తు గురించి మీరెవరు మాట్లాడటానికి అని ప్రశ్నిస్తున్నాను. రామోజీరావు అనే వ్యక్తి ఒక వైట్‌కాలర్ క్రిమినల్. ఆయన్ను సపోర్టు చేస్తూ జీవీఎల్ మాట్లాడటం తగదు.