వైయ‌స్ జ‌గ‌న్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

వైయస్‌ జగన్‌ పాలనకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర కార్యాల‌యంలో సంబరాలు

పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

హాజ‌రైన మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి

ఎన్నికలు వస్తున్నాయని గుంటనక్కలు నిద్ర లేచాయి: స‌జ్జ‌ల 

మళ్లీ గుంటనక్కలు పగటి వేశాలకు రెడీ అయ్యాయి

దత్తపుత్రుడితో ఎన్నికలకు పోవాలని చంద్రబాబు చూస్తున్నారు

 2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశాడు? చెప్పుకోవటానికి  ఒక పథకం అయినా ఉందా? 

ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయి.. 

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పని చేయాలని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపు 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అభివ‌ర్ణించారు. ఎన్నికలు వస్తున్నాయి అనగానే గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తున్నాయి.. ప్రజలను భ్రమల్లో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాయి.. అంతా అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్త అని హెచ్చరించారు.  రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. 50 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులకు తెలుసు ప్రభుత్వం ఆ యా వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారోనని అన్నారు.. 2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశాడు? చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇస్తున్నా అడ్డుకుంటున్నారు.. తాను ఏం చేయలేదు కనుకే చెప్పుకోలేక పోతున్నాడు. అమ్మ ఒడి ఇస్తానంటాడు.. పక్క రాష్ట్రాల్లోని పథకాలు చెబుతున్నాడు.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయి.. వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు మనకు మంచి అవకాశం ఇచ్చారు.. గుంట నక్కల వ్యవహారాలను ప్రజలకు వివరించండి.. 175 కు 175 వచ్చేటట్లు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. 

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..
వైయస్‌ జగన్‌ సంక్షేమ సంతకం చేసి నాలుగేళ్లు అయ్యింది. సంక్షేమం, సుస్థిర అభివృద్ధి నినాదంగా కాకుండా ఆచరణలో మొదలై నాలుగేళ్లు పూర్తి  అయ్యింది. ఆ సందర్భంగా మనమంతా ఇక్కడ కలిశాం. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

పై నుంచి వరుణుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. బాగా ఎండ ఉంటుందని అనుకుంటే ఇవాళ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నాం. 

ఈ నాలుగేళ్ల వైయస్‌ జగన్‌ పాలన ప్రపంచ స్థాయిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించింది. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ గుంటనక్కలు నిద్ర లేచాయి. మళ్లీ పగటి వేశాలు మొదలయ్యాయి. 

సిగ్గులేని చంద్రబాబు నిన్ననే కొత్త హామీలతో మళ్లీ ముందుకు వచ్చాడు. మళ్లీ ప్రజలను భ్రమలో పెట్టి తనకు ఇంకో అవకాశం ఇవ్వాలని కొత్త డ్రామా మొదలుపెట్టాడు. రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేసేందుకు మళ్లీ వస్తున్నాడు. 

ఈ తరుణంలో ఈ నాలుగేళ్లు మన ప్రభుత్వం ఏం చేసిందన్నది రాష్ట్రంలోని కోటీ 67 లక్షల కుటుంబాల్లో కోటి నలభై లక్షల కుటుంబాలకు పైగా మన సంక్షేమ పథకాలు ఆస్వాదీస్తున్నాయి. ఇవన్నీ గుర్తు చేస్తూ ..ప్రతి ఇంటికి వెళ్లి మన ఎమ్మెల్యేలు, నాయకులు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా  వివరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు మన నాయకులను సాదరంగా ఇళ్లలోకి ఆహ్వానించి మనం మరచిపోయిన పథకాలు కూడా గుర్తు చేస్తున్నారు. 

ఇక్కడేదో చేశానని చంద్రబాబు అమెరికాలో చప్పట్లు కొట్టించుకున్నట్లుగా కాకుండా మనం చేసింది ఇంటికి వెళ్తుంటే ప్రజలే మేం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. 90 శాతం మంది ప్రజాప్రతినిధుల్లో 50 శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులకు తెలుసు. అన్ని పథకాలు మహిళలకు ఇస్తున్నాం కాబట్టి వారికి కూడా తెలుసు. 

చంద్రబాబుకు తెలిసిన ఏకైక విద్య..ఎన్నికలు రాగానే కళ్లార్పకుండా టకటక అబద్ధాలు చెప్పడం మాత్రమే తెలుసు.  మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో చూస్తే అన్ని అబద్ధాలే కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను దొంగ దెబ్బ కొట్టి టీడీపీని లాక్కున్న చంద్రబాబు ఆ పార్టీ ఆఖరి అవసాన దశలో కూడా అవే అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబుకు అండగా ఆయన దత్తపుత్రుడు ఉన్నాడు. ఆయన ప్యాకేజీ తీసుకొని బాబును మోస్తాడని అనుకుంటున్నాడు. ఈ జంట ఎన్నికల్లో మరికొంత మందిని కలుపుకొని ఒక ఆర్కేస్ట్రాను పెట్టుకొని పగటి వేశగాడిలాగా వస్తున్నాడు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ఒక పోరాటం, యుద్ధం. ఎన్నికల సమయంలో ఏమైనా మాట్లాడవచ్చు. ఆకాశాన్ని కూడా కిందికి తెస్తానని, చందమామను చేతిలో పెడతానని చంద్రబాబు మాట్లాడుతాడు. ఆయన హామీలకు హద్దు ఉండదు. 

ఈ సమయంలో మనం పాత రోజులను గుర్తుకు తెచ్చుకొని 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఏం చేశాడో అందరికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఈ రోజుకు కూడా 27 పథకాలు వైయస్‌ జగన్‌ తీసేశాడని చెబుతున్నాడు. మాట్లాడితే చాలు అన్నా క్యాంటిన్, చంద్రన్న కానుక తప్ప మరేమి చెప్పడం లేదు. వీటి ద్వారా హెరిటేజ్‌కు పాలు, మజ్జిగ సరఫరా చేసి చంద్రబాబు ఎంత దోచుకున్నాడో..అన్నా క్యాంటిన్‌ టెండర్ల నుంచి ఎలా దండుకున్నాడో మనందరం చూశాం. కరువులో కూడా చంద్రబాబు ఆదాయాన్ని పొందాడు. 

గతంలో రుణమాఫీ గురించి చంద్రబాబు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేశాను..తనకు ఓట్లు వేయమని ఎందుకు అడగలేకపోతున్నాడు. చంద్రబాబు నిజంగా 50 శాతం ఎన్నికల హామీలు అమలు చేసినా ఘనంగా చెప్పుకునే వాడు. ఆయనే చెప్పకనే చెబుతున్నాడు..ఐదేళ్లు నేను ఏం చేయలేదంటున్నాడు. మరుగుదొడ్లు, అన్నా క్యాంటిన్లకు ఎల్లో రంగు వేశానని ఆయన చేసిన ఘన కార్యాలు చెప్పుకోవాలి తప్ప..ఆయన చేసింది ఏమీ లేదు. 

ఇవాళ వైయస్‌ జగన్‌ పథకాలను కాపీ కొట్టి అమ్మ ఒడి బదులు తల్లికి  వందనం అంటున్నాడు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ జనాలు నమ్మరని ఆయనకు తెలియదా? . తిరుణాల్లో పగటి వేషగాళ్లు వేసినట్లు ఎన్నికల్లో ఏదో ఒక హామీ ఇవ్వడం, మోసం చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు. అబద్ధాలు చెప్పి చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తాడు. సంబంధం లేని విషయాలను తెరపైకి తెచ్చి వాస్తవాలను మరుగున పడేలా చేస్తాడు.

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వారసత్వం ఉంది. నాన్నగారి పాలన మళ్లీ తెస్తానని ప్రజల్లోకి వెళ్లాడు. పదేళ్లు ప్రజల్లోనే ఉన్నారు. ప్రజలు ఏదైతే ఆశ పెట్టుకున్నారో వాటిని వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. 

వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విధంగా పని చేయకపోతే మనమందరం ఇలాంటి వేడుకలు జరుపుకునేవాళ్లం కాదు. ధీమాగా చెప్పుకునే వాళ్లం కాదు. మధ్యలో వచ్చిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు వైయస్‌ఆర్‌సీపీకి ఎంతగా ఉన్నాయో చూశాం. 

వైయస్‌ జగన్‌ ఒక్కరే..వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులంతా వైయస్‌ జగన్‌ కుటుంబ సభ్యులే. పార్టీలో అందరం కార్యకర్తలమే. మనమంతా వైయస్‌ జగన్‌ కోసం పని చేస్తున్నాం..ఆయన ప్రజల కోసం పని చేస్తున్నారు...అదే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారంటే..వైయస్‌ జగన్‌ వేసిన అడుగు బలమైన, ప్రజలకు అవసరమైన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన అడుగు కాబట్టే వారు ఆదరిస్తున్నారు. 

చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు పథకాలు మొదలుపెడుతారు. అందులో సగం సగం చేసి ..మళ్లీ పూర్తి చేస్తానని చెబుతాడు. వైయస్‌ జగన్‌ తాను చెప్పినవి డే వన్‌ నుంచి మొదలుపెడుతున్నారు. ఆయన చేసినవి ఇంటింటికీ వెళ్లి చెప్పుకునేలా పాలన చేస్తున్నారు. ప్రజల నుంచి స్పందన కూడా బ్రహ్మండంగా ఉంది. 

చంద్రబాబు కొత్తగా భ్రమలు కల్పించాలని ప్రయత్నిస్తున్నాడు. ఇష్యూ కానీ ఇష్యూలను రైజ్‌ చేసి పాలిటిక్స్‌ అంటే  ఇవే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే  పెద్ద యుద్ధం. ఏమరపాటుగా ఉంటే వెన్నుపోట్లు ఉంటాయి. వెనుకపోట్లు, ముందు పోట్లు ఉంటాయి. పక్కపోట్లు ఉంటాయి.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులంతా ఒక్కటిగా నిలబడి ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను పూర్తి చేయడానికి, దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి, చరిత్ర మనకు కూడా అవకాశం ఇచ్చింది. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు వైయస్‌ జగన్‌ లాంటి పెద్ద నాయకుడిని ఇవ్వడమే కాకుండా ఆయన ఆశలు, ఆకాంక్షలు, సమ సమాజం దిశగా అడుగులు వేసే దిశగా వాటిలో మనం పాలుపంచుకునే అవకాశం మనకు చరిత్ర ఇవ్వడం ద్వారా మనం కూడా ఉపయోగించుకోవాలి. 

మనం ఎక్కడికి వెళ్లినా ఇంతటి ఆదరణ ఉందంటే కారణం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆయన ఆలోచన విధానమే.  పార్టీ అంటే ఎలా ఉండాలి. నాయకుడు అంటే ఎలా ఉండాలని సగర్వంగా చెప్పుకునేలా మనకు వైయస్‌ జగన్‌ ఉన్నారు. గుంటనక్కలు ఉన్నాయి..వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించాలి. వైనాట్‌ 175 టార్గెట్‌ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ మరోసారి అందరికి సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్ని వర్గాల వారికి న్యాయం: మంత్రి మేరుగ నాగార్జున 
 అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ, ఇచ్చిన మ్యానిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. చంద్రబాబు మ్యానిఫెస్టోని అమలు చేయలేక దాన్ని కనపడకుండా చేశారు.. జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నా అడ్డుకుంటున్నారని,  రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ మోసం చేసిన మనిషి చంద్రబాబని ధ్వజమెత్తారు.

న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ :  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  
నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆనాడు జనం వైయ‌స్ జగన్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలన్నీ విని మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. పరిపాలనని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడం, రైతులకు అవసరమైన పథకాలను పొలం గట్టుదాకా తీసుకెళ్లిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దేనని చెప్పారు.  మాటలు చెప్పి కాలం గడిపే చంద్రబాబు లాంటి మనిషి జగన్ కాదని... ఆయన చేతల మనిషని కొనియాడారు. 

 

Back to Top