అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌లపై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. వీటికి సంబంధించి పార్టీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాస రెడ్డి ఎన్నికల అధికారికి ఆధారాలను అందచేశారు. 1.పవన్ కల్యాణ్ ఈనెల 26 వ తేదీన ఎన్నికల ప్రచారం సందర్బంగాా రాజోలు లో ముఖ్యమంత్రి వైయస్ జగన్,రాజోలు లో వైఎస్ఆర్సీపీ నేత రాపాక వరప్రసాద్ లపై వ్యక్తిగతంగా అనుచితవ్యాఖ్యలు చేశారు..ఇవి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2.టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ ఈ నెల 26 వ తేదీన దెందులూరు లో దళితులపై అనుచిత,కించపరిచే వ్యాఖ్యలు చేశారు.కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.