వాహన మిత్రులకు భరోసా

నేడు వైఎస్ఆర్ వాహనమిత్ర నగదు జమ

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున లబ్ధి

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 24వేల మంది లబ్ధిదారులు

ఇప్పటికే మూడు విడతల్లో జిల్లాలో రూ.83.07 కోట్ల మేర సాయం

  అమ‌రావ‌తి: రవాణా రంగంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘వైయ‌స్సార్‌ వాహన మిత్ర’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా అందించనుంది.  వైయస్ఆర్ వాహన మిత్ర.. డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా 2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261.51 కోట్ల ఆర్థిక సాయం. నేడు విశాఖపట్నంలో బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

తమ బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు జగనన్న ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది.. వైయస్ఆర్ వాహనమిత్ర కింద నేడు అందిస్తున్న రూ.261.51 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన జగనన్న ప్రభుత్వం మొత్తం రూ. 1,026 కోట్లు సాయంగా అందించింది.

2,61,516 మందికి రూ.261.51 కోట్ల లబ్ధి
2022–23కుగాను ఈ పథకం కింద 2,61,516 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సిక్యాబ్‌ డ్రైవర్లకు ఈ ప్రయోజనం కలి్పంచనుంది. ఒక్కో లబి్ధదారునికి రూ.10వేల చొప్పున మొత్తం రూ.261.51 కోట్లను శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తారు. దీంతో ఈ నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.1,026 కోట్లను పంపిణీ చేసినట్లవుతుంది.

2022-23 వైఎస్ఆర్ వాహన మిత్ర లబ్ధిదారుల వివరాలు సామాజిక వర్గాల వారీగా...

బీసీలు  -1,44,166
ఎస్సీలు - 63,594
ఎస్టీలు - 10,472
కాపులు - 21,481
మైనార్టీలు - 5,267
ఇతరులు - 16,536

మొత్తం 2,61,516

నాలుగు విడతల వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వివరాలు

2019-20
లబ్ధిదారులు
2,36,343
రూ.236.34 కోట్లు

2020-21
లబ్ధిదారులు
2,73,476
రూ.273.47 కోట్లు

2021-22
లబ్ధిదారులు
2,54,646
రూ.254.64 కోట్లు

2022-23
లబ్ధిదారులు
2,61,516
రూ.261.51 కోట్లు

సీఎం వైయ‌స్‌ జగన్‌ విశాఖ పర్యటన ఇలా..

ఇక వైయ‌స్సార్‌ వాహనమిత్ర పంపిణీ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉ.9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు. 10.30కు విశాఖ చేరుకుంటారు. 11.05కు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుని వైఎస్సార్‌ వాహన మిత్ర లబి్ధదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మ.1.20 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరుతారు. 

Back to Top