వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక ప‌థ‌కం ప్రారంభం

తొలి జీవో జారీ చేసిన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం

పెన్ష‌న్‌ను రూ.2250 పెంచిన ప్ర‌భుత్వం

విక‌లాంగుల‌కు రూ.3 వేలు, కిడ్నీ బాధితుల‌కు రూ.10 వేలు పెన్ష‌న్‌

జులై 1 నుంచి కొత్త పింఛ‌న్ చెల్లింపు

అమ‌రావ‌తి: ‘ప్రతి అవ్వకు.. ప్రతి తాతకు..’ అంటూ సభల్లో భరోసానిచ్చే జననేత మాట నిలబెట్టుకున్నారు. ‘వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను..’అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైయ‌స్ఆర్ పెన్ష‌న్ కానుక  ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ప్రారంభించింది.  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నవరత్నాల అమలుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజల దిశదశను మారుస్తాయని బలంగా విశ్వసించే నవరత్నాల్లో ఒకటైన పెన్షన్ల పెంపు ఫైల్‌పై జనహృదయ నేత ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని చేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలి అడుగు వేశారు. ప్రస్తుతం రూ.2వేలు ఇస్తున్న పెన్షన్‌ను జూలై 1వ తేదీ నుంచి రూ.2250 పంపిణీ చేయనున్నారు.   

నవరత్నాల్లో భాగంగా వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఇస్తున్న రూ.1000 పింఛన్‌ మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతామని 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జగన్‌ రూ. రెండు వేలు పెంచుతామని చెప్పడంతో చంద్రబాబు రూ.2 వేలు పెంచుతూ ప్రకటన చేశాడు. ఫిబ్రవరి నుంచి అమలులోకి తీసుకొచ్చారు.అయినా ఆ అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు చంద్రబాబు మాటను విశ్వసించలేదు. జననేతకు జై కొట్టారు. అఖండ మెజార్టీతో గెలిపించి సీఎం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం పెన్షన్‌ పెంపుపై చేయడంతో అంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది రూ.250 పెంచుతున్నట్టు ప్రకటించారు. అదే విధంగా రెండో ఏడాది రూ.500, మూడో ఏటా రూ.750, నాల్గో ఏడాది రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.  ప్రస్తుతం 80 శాతం వికలత్వం ఉన్న దివ్యాంగులకు మాత్రమే రూ.3వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నారు. మిగిలిన వారందరికి రూ.2వేల చొప్పున పెన్షన్‌ ఇస్తున్నారు. దీంతో మిగిలిన వారందరూ  జూలై 1వ తేదీ నుంచి రూ.2250 చొప్పున పెన్షన్‌ పొందనున్నారు. పింఛ‌న్ వ‌య‌స్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్ల‌కు కుదిస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది.ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో పెన్ష‌న్‌దారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top