యువతకు చుక్కాని వైయస్ఆర్‌

వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విద్య, ఉపాధికి పెద్ద పీట

ఉత్తమ విద్యా సంస్థలు..

ఉన్నత విద్య కోసం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌

భారీగా ప్రభుత్వ నియామకాలు

ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు

రేపు వైయ‌స్ఆర్ 75వ జ‌యంతి

దేశ భవిష్యత్‌ యువత మీద ఆధారపడి ఉంటుందని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నమ్మేవారు.  అందుకే విద్యార్థులు, యువజనుల కోసం ఎన్నెన్నో పథకాలు, నిర్ణయాలు అమలు చేశారు. భవిష్యత్‌ ను బంగారంగా మలిచేందుకు పాటు పడ్డారు. అందుకే ఆయన యుతకు చుక్కానిలా మారాడు.

 
చక్కటి చదువు లభిస్తే విద్యార్థుల జీవితాలు మెరుగు అవుతాయని వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి నమ్మారు. అందుకే జాతీయ స్థాయి విద్యా సంస్థ ఐఐటీ ని మెదక్‌ జిల్లా కంది లో ఏర్పాటు చేయించారు. అలాగే కృష్ణా జిల్లా నూజివీడు, వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ, ఆదిలాబాద్‌ జిల్లా బాసర లో ట్రిపుల్‌ ఐటీలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక బిట్స్‌ పిలానీ విద్యా సంస్థ, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయగలిగారు. ఈ విద్యా సంస్థలకు మౌళిక వసతులు కల్పించేందుకు భూములు, నిధుల్ని సమకూర్చారు. సాంకేతిక విద్యను అందించేందుకు ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్‌ కాలేజీల ఏర్పాటుని ప్రోత్సహించారు. అటు, ప్రభుత్వ రంగంలో జూనియర్, డిగ్రీ కళాశాలలను స్థాపించారు. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి పది లోపు విశ్వ విద్యాలయాలు మాత్రమే ఉంటే, ఒక్క వైయస్‌ఆర్‌ హయంలోనే 17 విశ్వ విద్యాలయాల్ని స్థాపించారు. దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ యూనివర్శిటీని రప్పించి, ఉన్నత విద్యను ప్రజల ముంగిట్లో నిలిపిన దార్శనికుడు.

ఆశాదీపం ఫీజు రీయింబర్స్‌మెంట్‌
బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు అబ్బితే ఆయా కుటుంబాల్లో వెలుగులు నిండుతాయన్నది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నమ్మకం. అందుకే ఆయా వర్గాల పిల్లలకు స్కాలర్‌ షిప్పులు పెంచటంతో పాటు గురుకులాలు, హాస్టల్స్‌ ను పెంచారు. ఆ తర్వాత కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేద పిల్లలు ఊహించలేని విధంగా ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందితే, ఫీజులు ప్రభుత్వం భరించేలా నిర్ణయం అమలు పరిచారు. దీంతో బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్‌ విద్యను అభ్యసించేందుకు వీలు కలిగింది. దీని కింద 11లక్షల మంది బీసీ వర్గాలు, 5 లక్షలమంది ఎస్సీ వర్గాలు, 1.8 లక్షల మంది ఎస్టీ వర్గాలు, 7.4 లక్షల మంది మైనార్టీలు, 7 లక్షల మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రయోజనం దక్కింది. ఒక్క 2009..10 ఆర్థిక సంవత్సరంలోనే 25వందల కోట్ల రూపాయిలు వెచ్చించి ఫీజు రీ ఇంబర్స్‌ మెంట్‌ చేయించారంటే విద్యా దానం ఎంత పెద్ద ఎత్తున సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ నోటిఫికేషన్లు
మహానేతకు ముందు పరిపాలన చేసిన చంద్రబాబు హయంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో యువత నిరాశలో కూరుకొని పోయిన సమయం. మహానేత అధికారంలోకి వచ్చాక పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ కు జవసత్వాలు కల్పించారు. పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 17 వేల పోలీసు నియామకాలు, 50 వేల టీచర్‌ నియామకాలు జరిగాయి. జల యజ్ఞం పెద్ద ఎత్తున జరగటంతో లక్ష మందికి ఉపాధి దొరికింది. ఒక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం కిందనే 38 వేల మందికి ఉపాధి లభించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లు క్రమబద్దీకరణ చేయటంతో పెద్ద ఎత్తున నియామకాలకు అవకాశం ఏర్పడింది.
ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు

If Y.S. Rajasekhar Reddy was alive, would Andhra Pradesh have been divided?  - Quora
ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి చొరవ చూపించారు. రాజీవ్‌ ఉద్యోగ శ్రీ పథకం కింద నైపుణ్యాల కల్పన కు మార్గం సుగమం చేశారు. 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. వివిధ జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసి ఉపాధి మార్గాల్ని సరళతరం చేశారు. ప్రైవేటు రంగంలో పరిశ్రమల్ని ప్రోత్సహించి ఉపాధి మార్గాల్ని వేగవంతం చేశారు. 2004–2008 మధ్య కాలంలో 2.14 లక్షల ఉద్యోగాల్ని కల్పించగలిగారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లను విరివిగా మంజూరు చేశారు. వీటిల్లో పూర్తిగా పారిశ్రామిక యూనిట్ల ను స్థాపించినట్లయితే దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలు ఏర్పడుతాయని అంచనా. దీన్ని బట్టి ఉపాధి కల్పనకు మహానేత ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో అర్థం అవుతుంది. వైయస్‌ఆర్‌ చొరవతో రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఉత్పాదన రంగం కళకళలాడాయి. దీంతో పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు సుగమం అయ్యాయి.

YS Rajashekar Reddy Photos | YS Rajashekar Reddy Photos | YS… | Flickr
కళకళ లాడిన ఐటీ
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు కళకళ లాడాయి. 2005లో నూతన ఐటీ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీన్ని విజయవంతంగా అమలు చేయటంతో ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ తో పాటు విశాఖ, తిరుపతి, వరంగల్‌ , విజయవాడల్లో ఐటీని వేగవంతం చేశారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ వృద్ధి రేటు 32 శాతం ఉంటే, ఏపీలో 41శాతం సాధించారు. ఐటీ కంపెనీలను ప్రోత్సహించటంతో సేవ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని కల్పించారు.
      Ys Rajasekhara Reddy HD Image | Download Free
 
     

Back to Top