ఆగ‌ని టీడీపీ అరాచకం

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా దాడులు
 

విజయవాడ: ఏపీలో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ శ్రేణులు బరి తెగించాయి. గంట్యాడ మండలం పెద్దమదుపాడులో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన నరేష్‌ను ఆసుపత్రికి తరలించారు. 

దుకాణాలపై టీడీపీ గూండాల దాడులు..
గత రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అజిత్‌సింగ్‌నగర్‌ లూనా సెంటర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త భాషా టైలరింగ్‌ దుకాణంపై దాడి చేశారు. రెండు టైలరింగ్ దుకాణాలను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.. దుకాణంలోని టైలరింగ్‌ మెషీన్‌లు, ఎల్‌ఈడీ టీవీ, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో టీడీపీ కార్యకర్త వేల్పుల విజయ్‌బాబుతో పాటు మరికొంత మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వేల్పుల విజయ్ బాబుతో పాటు ఆరుగురిపై అజిత్‌సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

వైయ‌స్ఆర్ విగ్రహాలు ధ్వంసం
రాష్ట్రంలో  వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు పనిగట్టుకుని వైయ‌స్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పెట్రోల్‌ పోసి తగలబెడుతున్నారు. ట్రాక్టర్లతో కూల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు.

Back to Top