మరోసారి పచ్చవిషం

వంద తలల పాము విషాన్ని విరజిమ్మినట్టుగా ఉంది పచ్చపార్టీ, ఎల్లో మీడియా చేస్తున్న అవాస్తవ ప్రచారం. సీఎం జగన్ పాలనపై విమర్శించే అవకాశం లేక, తప్పుడు ఆరోపణలు చేస్తుంటే పబ్లిక్ గా దొరికిపోతుండటం చేత కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మీడియా పై జులుం చేస్తున్నారంటూ మరో విష ప్రచారానికి తెరతీసారు. 
పచ్చజ్యోతి పచ్చి అబద్ధాల కథనం
ఏబీఎన్ కనపడొద్దు అంటూ భారీ హెడ్డింగుతో రాసిన ఆంధ్రజ్యోతి కథనం నిండా పచ్చవిషమే కనిపిస్తుంది. మంత్రులు ఆపరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ బరి తెగించి అబద్ధాలను అచ్చువేస్తోంది ఈ పచ్చి పచ్చ పత్రిక.  సాధారణ ప్రజలకు తెలియని విషయాలు కనుక తామెలా రాసినా జనాలు నమ్మేస్తారనే పిచ్చి భ్రమలోనే ఇంకా ఉన్నాయి పచ్చపత్రికలు ఉన్నాయి అనిపిస్తుంది అంధ్ర జ్యోతి రాసిన ఈ కథనం చూస్తే. ఎమ్.ఎస్.ఓలపై ఒత్తిడి తెచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులే ఎబీఎన్ ఛానెల్ ను ఆపించారన్నది ఈ పత్రిక ఆక్రోశపూరిత ఆరోపణ. అయితే నిజాలేమిటో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. 
సిటీ కేబుల్ MSOలు టీడీపీ మద్దతుదారులే అని అందరికీ తెలిసిన విషయమే. కనుకనే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైయస్ జగన్ పాదయాత్రకు విపరీతమైన స్పందన ప్రజలనుంచి వస్తోందని చూసి రాష్ట్రంలో చాలా చోట్ల సాక్షీ ప్రసారాలు జరగకుండా అడ్డుకున్నారు. అయితే ఆంధ్రజ్యోతి విషయంలో జరిగింది వేరు. అధికారం చేతిలో ఉంది కదా అని ఐదేళ్లుగా సిటీ కేబుల్ వాళ్లకు 5 ఏళ్లుగా కేరియర్ ఛార్జులు కట్టకుండా నడింపించేసారు. నెలవారీ చెల్లించాల్సిన కేరియర్ ఛార్జ్ చెల్లించకపోయినా మిగతా ఛానల్స్ తో సమానంగా ప్రియారిటీలో ఉండేది ఏబీఎన్. కనీసం ప్రభుత్వం మారాకైనా బుద్ధి తెచ్చుకుని కట్టిందా అంటే ఈ మూడు నెలల్లో కూడా పైసా చెల్లించలేదట సదరు ఛానెల్. తమ ఛానెల్ రాకపోతే వినియోగదారులే బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేయాలని రాధాక్రిష్ణ గగ్గోలు పెట్టే బదులు ఎంఎస్వోలపై తానే ఫిర్యాదు చేయకూడదా? ఊహూ...ఆ పని మాత్రం చేయదు ఈ పచ్చ మీడియా యాజమాన్యం. ఎందుకంటే ఫిర్యాదు దాకా వెళితే వీళ్లు చేసిన అరాచకం బయటపడుతుంది కనుక. 
విష ప్రచారమే పచ్చపత్రిక ఉద్దేశ్యం
ఏదో కారణంతో వైయస్ జగన్ మీద విషం కక్కడమే ప్రధాన అజెండాగా పని చేస్తున్నారు కనుక ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రితో ముడిపెట్టి తాటికాయ అక్షరాలతో అచ్చేసి వదిలేస్తున్నారు. నిజంగానే ముఖ్యమంత్రి కక్ష సాధించదలుచుకుంటే ఆ పత్రికాధిపతి ఐదేళ్ల పైరవీల కథలు బయటకు తీస్తే చాలదా? ఇప్పటిదాకా ఆ పత్రికలో రాసిన విషపు రాతలపై, అబద్ధాలపై, ప్రతిష్టకు భంగం కలిగించేలా అచ్చోసిన అంశాపై ఫిర్యాదు చేసినా, పరువు నష్టం దావా వేసినా సరిపోతుంది. ఇప్పటికే ఆ ప్రతికాధిపతిపై, ప్రతికపై లెక్కలేనన్ని కేసులు, పరువు నష్టం దావాలు ఉండనే ఉన్నాయి. 
ఇదీ రాసుకో రాధాకృష్ణ
వైయస్ జగన్ తన పాలనతో, సంక్షేమ నిర్ణయాలతో ప్రజల మసులు గెలుచుకుంటున్నారు. కనుక ఎప్పటిలా పచ్చ రాతలు, అబద్ధాలు రాసి ప్రజలను నమ్మించేయాలంటే ఇకపై కుదరదు. ప్రజలకు, పాఠకులకు గంతలు కట్టడం వీలు కాదు. పారదర్శక విధానాలతో ప్రజారంజకంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంట ఉన్నది అచ్చమైన ప్రజాబలం...చంద్రబాబుకులా కులబలం, ఎల్లో మీడియా బలగం కాదు.  తాము చేసిన తప్పులు కప్పి పుచ్చుకుంటూ, ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నిందలు మోపుతున్న ఈ పచ్చి అబద్ధాల పత్రికకు ప్రజల తగిన రీతిలో బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. రోత రాతలతో ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని, ప్రభుత్వ విధానాలను తప్పుగా ప్రచారం చేస్తున్నందుకు, వాస్తవాలు తెలుసుకున్న పాఠకులే ఛీ కొట్టి మరీ చెల్లు చీటీ కడతారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top